ప్రేమమ్ (Premam) చిత్రంతో తెలుగులో ప్రవేశించి ఆరంగేట్రం చిత్రంతోయూత్ ఫేవరెట్ బ్యూటీగా ఆకర్షించింది అనుపమ పరమేశ్వరన్. కెరీర్ మొదట్లో చాలా ట్రెడిషనల్‌గా కనిపించిన అనుపమ.. హద్దు మీరి లిప్ లాక్ లకు చిట్టి పొట్టి దుస్తులను ధరించేందుకు చాలా దూరంగా ఉండేది. అలా ఉంటే ఆఫర్స్ రావడం లేదని అనుకుందో ఏమో అడ్డుకట్టలు అన్ని తొలగించింది. ఓ యూత్ ఫుల్ లవ్ ఎంటర్ టైనర్ రౌడీ బాయ్స్ కోసం హద్దు మీరిందని గుసగుసలు వినిపిస్తున్నాయి.
రౌడీ బాయ్స్ చిత్రంలో ఏకంగా ఐదు సార్లులిప్ లాక్ ఇచ్చి అందరిని ఆశ్చర్యపరచనుందట. బెడ్ రూమ్ సన్నివేశాల్లోనూ ఘాటైన రొమాన్స్ తో మెరుపులు మెరిపించనుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. దిల్ రాజు సోదరుని కుమారుడు కొత్త హీరో ఆశిష్ తో అనుపమ జతకట్టగా, అతనితో అదరచుంబనాల్లో అనుపమ(Anupama parameswaran) రెచ్చిపోనుందనే టాక్స్ వినిపిస్తున్నాయి. రౌడీ బాయ్స్ చిత్రం విడుదలైన తర్వాత అనుపమ ఇమేజ్ అమాంతం మారిపోతుందని కూడా చెప్పుకుంటున్నారు. యూత్ ఫుల్ ప్రేమకథా చిత్రం కాబట్టి ఆ మాత్రం ఘాటైన సన్నివేశాలకు కొదవేమీ ఉండదని చెబుతున్నారు. హుషారు ఫేమ్ దర్శకుడు శ్రీహర్ష కొంగువంటి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.