1980 కాలంలో జగిత్యాల చుట్టు పక్కల జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘జితేందర్ రెడ్డి’. రాకేష్ వర్రే టైటిల్ రోల్ చేశారు. విరించి వర్మ దర్శకుడు. ముదుగంటి రవీందర్‌రెడ్డి నిర్మాత. ఈ నెల 8న సినిమా విడుదల కానుంది. ఇటీవలే విడుదలైన ట్రైలర్‌కి మంచి స్పందన వస్తున్నదని, కాలేజీ రోజుల నుంచీ ప్రజా సమస్యలపై పోరాడటమేకాక, దేశంకోసం ధర్మం కోసం నక్సలైట్లతో జితేందర్‌రెడ్డి చేసిన యుద్ధమే ఈ సినిమా ప్రధాన ఇతివృత్తమని మేకర్స్ తెలిపారు. వైశాలిరాజ్, రియా సుమన్, ఛత్రపతి శేఖర్, సుబ్బరాజు, రవిప్రకాశ్ తదితరులు ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కెమెరా: వీఎస్ జ్ఞానశేఖర్, సంగీతం: గోపీసుందర్, సహనిర్మాత: ఉమా రవీందర్.