Most Anticipated Movies 2025 | సినిమాలకు సంబంధించి రేటింగ్ పరంగా అత్యంత విశ్వసనీయత కలిగిన ఆన్లైన్ వేదికగా పేరున్న ఇంటర్నెట్ మూవీ డేటా బేస్ (ఐఎండీబీ) ప్రతి ఏడాది ఎక్కువ ప్రేక్షకాదరణ పొందిన చిత్రాల జాబితాను ప్రకటిస్తుందన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే కొత్త ఏడాదిలో అత్యధిక సంఖ్యలో ప్రేక్షకులు ఎదురుచూస్తున్న చిత్రాలను కూడా గుర్తించి జాబితాలు ప్రకటించడం ట్రెండీగా మారింది. ఇందులో భాగంగానే తాజాగా మోస్ట్ అవైటెడ్ ఇండియన్ మూవీస్ జాబితాను ప్రకటించింది ఐఎండీబీ. 250 మిలియన్లకు పైగా ఐఎండీబీ కస్టమర్ల పేజ్ వ్యూస్ ఆధారంగా తీసిన ఈ లిస్ట్‌ను తాజాగా ప్రకటించింది.
ఐఎండీబీ మోస్ట్ అవైటెడ్ ఇండియన్ మూవీస్ జాబితా చూసుకుంటే మొదటి స్థానంలో సల్మాన్ ఖాన్ నటిస్తున్న సికందర్ (Sikandar) ఉంది. ఆ తర్వాత యశ్ నటిస్తున్న టాక్సిక్ (Toxic), రజనీకాంత్ నటిస్తున్న కూలీ చిత్రాలు ఉన్నాయి. ఇక పూర్తి జాబితాను చూసుకుంటే.
1. సికందర్ (Sikandar) – హిందీ
Sikandar
సల్మాన్ ఖాన్, రష్మికా మందన్న, కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా యాక్షన్ థ్రిల్లర్ చిత్రం సికందర్ (Sikandar). A.R. మురుగదాస్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుడగా.. ఈద్ 2025 (ఏప్రిల్) కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం ఐఎండీబీ మోస్ట్ అవైటెడ్ ఇండియన్ మూవీస్ జాబితాలో మొదటి స్థానంలో నిలిచింది.
2.టాక్సిక్ (Toxic) – కన్నడ
Toxic
కేజీఎఫ్ చిత్రాల నటుడు యశ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం టాక్సిక్ (Toxic). కియారా అద్వానీ, నయనతార కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమాకు నేషనల్ అవార్డు విన్నర్ గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహిస్తుంది. పీరియడ్ యాక్షన్ డ్రామాలో రాబోతున్న ఈ చిత్రం ఏప్రిల్ 10, 2025 ప్రేక్షకుల మందుకు రాబోతుంది. ఈ చిత్రం ఐఎండీబీ మోస్ట్ అవైటెడ్ ఇండియన్ మూవీస్ జాబితాలో రెండో స్థానంలో నిలిచింది.
3.కూలీ (Coolie) – తమిళం
Coolie
సూపర్ స్టార్ రజనీకాంత్, నాగార్జున అక్కినేని, శృతి హాసన్ తదితర అగ్ర నటులు నటిస్తున్న చిత్రం .కూలీ (Coolie). ఈ సినిమాకు లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నాడు. లియో వంటి బ్లాక్ బస్టర్ తర్వాత లోకేష్ దర్శకత్వంలో ఈ సినిమా వస్తుండటంతో మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమా ఐఎండీబీ లిస్ట్‌లో 3వ ప్లేస్‌లో ఉంది.
4. హౌస్‌ఫుల్ 5 (Housefull 5) – హిందీ
Housefull
బాలీవుడ్ నటులు అక్షయ్ కుమార్, రితేష్ దేశ్‌ముఖ్, అభిషేక్ బచ్చన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం హౌస్‌ఫుల్ 5 (Housefull 5). కామెడీ జానర్లో వస్తున్న ఈ చిత్రం జూన్ 6, 2025 ప్రేక్షకుల ముందుకు రానుండగా.. తరుణ్ మన్సుఖాని దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం ఐఎండీబీ మోస్ట్ అవైటెడ్ ఇండియన్ మూవీస్ జాబితాలో నాలుగవ స్థానంలో నిలిచింది.
5. బాఘీ 4 (Baaghi 4) – హిందీ
టైగర్ ష్రాఫ్, సంజయ్ దత్, సోనమ్ బజ్వా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం బాఘీ 4 (Baaghi 4). ఈ సినిమాకు అహ్మద్ ఖాన్ దర్శకత్వం వహిస్తుండగా.. యాక్షన్ జానర్లో ఈ మూవీ రాబోతుంది. ఈ చిత్రం కూడా ఐఎండీబీ లిస్ట్‌లో 5వ ప్లేస్‌లో ఉంది.
6. ది రాజా సాబ్ (The Raja Saab) – తెలుగు
Raaja Saabb
బాహుబలి, సాహో, కల్కి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు ప్రభాస్, మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ది రాజా సాబ్ (The Raja Saab). ఈ సినిమాకు మారుతి దర్శకత్వం వహిస్తుండగా.. హారర్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా రాబోతుంది. ప్రభాస్ తొలిసారి హారర్ సినిమా చేస్తుండటంతో భారీ అంచనాలు ఏర్పాడ్డయి. ఈ చిత్రం కూడా ఐఎండీబీ లిస్ట్‌లో చోటు దక్కించుకుంది. 2025 మోస్ట్ అవైటెడ్ ఇండియన్ మూవీస్ జాబితాలో 6వ చిత్రంగా నిలిచింది.
7. వార్ 2 (War 2) – హిందీ
నటీనటులు: హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్, కియారా అద్వానీ
దర్శకుడు: అయాన్ ముఖర్జీ
విడుదల తేదీ: ఆగస్ట్ 14, 2025
జానర్: యాక్షన్ థ్రిల్లర్
8. L2: ఎంపురాన్ (L2: Empuraan) – మలయాళం
L2 Empuraan
నటీనటులు: మోహన్‌లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్
దర్శకుడు: పృథ్వీరాజ్ సుకుమారన్
విడుదల తేదీ: మార్చి 27, 2025
జానర్: యాక్షన్ థ్రిల్లర్
9. కన్నప్ప (Kannappa) –
Kannappa
నటీనటులు: విష్ణు మంచు, అక్షయ్ కుమార్, మోహన్‌లాల్, ప్రభాస్ (కామియో)
దర్శకుడు: ముఖేష్ కుమార్ సింగ్
విడుదల తేదీ: 2025 (తేదీ ఇంకా నిర్ధారణ కాలేదు)
జానర్: మిథలాజికల్ యాక్షన్
10. రెట్రో (Retro) – తమిళం
Retro
నటీనటులు: సూర్య, పూజా హెగ్డే, జయరామ్
దర్శకుడు: కార్తిక్ సుబ్బరాజ్
విడుదల తేదీ: మే 1, 2025
జానర్: యాక్షన్ డ్రామా
Thug Life
Thug Life) – తమిళం
నటీనటులు: కమల్ హాసన్, ఐశ్వర్య లక్ష్మి, త్రిష కృష్ణన్
దర్శకుడు: మణిరత్నం
విడుదల తేదీ: జూన్ 5, 2025
జానర్: యాక్షన్ డ్రామా
11. కాంతార: ఎ లెజెండ్ – చాప్టర్ 1 (
Kantara Chapter 1
12: A Legend – Chapter 1) – కన్నడ
నటీనటులు: రిషబ్ శెట్టి, సప్తమి గౌడ
దర్శకుడు: రిషబ్ శెట్టి
విడుదల తేదీ: అక్టోబర్ 2, 2025
జానర్: మైథలాజికల్ యాక్షన్