Shankar About Game Changer Run Time | గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, కియార అద్వానీ జంటగా నటించిన తాజా చిత్రం గేమ్ ఛేంజర్. దిగ్గజ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి మిక్స్డ్ టాక్‌తో ప్రస్తుతం థియేటర్లలో రన్ అవుతుంది. అయితే ఈ సినిమా రన్‌టైంకి సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు దర్శకుడు శంకర్.
ఆయన మాట్లాడుతూ.. గేమ్ ఛేంజర్ రన్‌టైంతో నేను సంతృప్తిగా లేనని వెల్లడించారు. మొదటగా నేను అనుకున్న దాని ప్రకారం.. ఈ చిత్రం 5 గంటల రన్‌టైంతో ఉండాలి. కానీ సమయాభావం వల్ల కొన్ని సీన్స్ కట్ చేయాల్సి వచ్చింది. దీంతో సినిమా అనుకున్నంతా మంచిగా రాలేదు అంటూ శంకర్ వెల్లడించారు. దీంతో ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ అనగానే ఓ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. శంకర్ నేరుగా తెలుగులో తీసిన తొలి సినిమా కావడం, దిల్ రాజు లాంటి నిర్మాత చేతులు కలపడం, సంక్రాంతి బరిలో అందరికంటే ముందుగా అడుగుపెట్టడం.. ఇలా ఎన్నో ప్రత్యేకతలు, అంచనాలున్న సినిమాగా ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) ప్రేక్షకులు ముందుకు వచ్చింది. అయితే అంచనాలు భారీగా ఉన్నప్పటికి రోటీన్ కథ అవ్వడంతో ప్రేక్షకులు ఈ సినిమాని తిప్పికొట్టారు.
I’m not completely satisfied with the #GameChanger output. I had to trim many scenes due to time constraints.
– Director @shankarshanmugh— Telugu Chitraalu (@TeluguChitraalu) January 14, 2025