Ileana | గోవా బ్యూటీ ఇలియానా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దేవదాసు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ నటి ఆ తర్వాత రాఖీ, పొకిరి, జల్సా వంటి సూపర్హిట్లను అందుకోవడమే కాకుండా స్టార్ నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఒకప్పుడు స్టార్ నటిగా రూల్ చేసిన ఈ భామ ప్రస్తుతం సినిమాలు మానేసి ఫ్యామిలీతో సమయం గడుపుతున్న విషయం తెలిసిందే. 2023లో మైఖేల్ డోలన్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్న ఇలియానా ఇద్దరు బిడ్డలకు జన్మనిచ్చింది. అయితే గత కొన్ని రోజులుగా ఫ్యామిలీతోనే గడుపుతున్న ఈ భామ.. తాజాగా మళ్లీ సినిమాలు చేయబోతున్నట్లు ప్రకటించింది. ఈ
ప్రస్తుతం తాను తన ఇద్దరు కొడుకుల సంరక్షణలో బిజీగా ఉన్నానని, అందుకే సినిమాలకు విరామం తీసుకున్నానని ఇలియానా చెప్పింది. అలాగే అభిమానులు నన్ను ఎంతగా మిస్ అవుతున్నారో నాకు తెలుసు. నటన అంటే నాకెంతో ఇష్టం. తెరపై కనిపించడం, విభిన్నమైన పాత్రలు పోషించడం, సెట్లో ఉండే సందడి… ఇవన్నీ నాకు చాలా ఇష్టం. నా కెరీర్లో ఎంతోమంది గొప్ప వారితో కలిసి పనిచేసే అవకాశం రావడం నా అదృష్టం అని ఇలియానా అన్నారు.
అయితే పిల్లల బాధ్యతకు తాను మొదటి ప్రాధాన్యం ఇస్తున్నానని, అందుకే కొద్ది రోజులు ఆగి మళ్లీ వస్తానని ఆమె తెలిపారు. తిరిగి వచ్చే ముందు మానసికంగా, శారీరకంగా సిద్ధం కావడానికి కొంత సమయం పడుతుంది. ఏ పని చేసినా దానికి పూర్తిగా న్యాయం చేయాలనుకుంటాను అని ఆమె ఇలియానా తెలిపారు.