Ileana D’Cruz Baby Bump | ప్రముఖ నటి ఇలియానా డి క్రూజ్ రెండోసారి తల్లి కాబోతుంది. ఇటీవల ఆమె తన బేబీ బంప్‌ను చూపిస్తూ అభిమానులతో ఈ శుభవార్తను పంచుకున్నారు. ఆమె ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఒక బ్లాక్ అండ్ వైట్ ఫోటోను షేర్ చేశారు. ఈ ఫోటోలో ఇలియానా తన గర్భిణి స్నేహితురాలితో కలిసి నవ్వుతూ, తమ బేబీ బంప్‌లను చూపిస్తూ కనిపించారు. ఈ ఫోటోకు ఆమె “బంప్ బడ్డీస్” అని క్యాప్షన్ ఇచ్చారు.
ఇలియానా తన రెండవ గర్భం గురించి గత జనవరిలోనే పరోక్షంగా హింట్ ఇచ్చింది. ఆ తర్వాత ఫిబ్రవరిలో అర్ధరాత్రి తనకు కలిగిన కొన్ని కోరికలను చూపిస్తూ “మీరు గర్భవతి అని చెప్పకుండానే చెప్పండి” అని క్యాప్షన్ పెట్టి, తన రెండవ గర్భాన్ని ధృవీకరించారు. అప్పటి నుండి అభిమానులు ఆమె నుండి అధికారిక ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇలియానా 2023లో మైఖేల్ డోలన్‌ను వివాహం చేసుకుంది. అదే సంవత్సరం ఏప్రిల్‌లో తన మొదటి గర్భాన్ని ప్రకటించింది. ఆ తర్వాత ఆగస్టులో ఆమె తన కుమారుడు కోవా ఫోనిక్స్ డోలన్‌కు జన్మనిచ్చారు. ప్రస్తుతం, ఇలియానా తన రెండవ బిడ్డ రాక కోసం ఆనందంగా ఎదురుచూస్తుంది. ఈ వార్తతో ఆమె అభిమానులు, సినీ వర్గాల నుండి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.