సోషల్‌మీడియాలో తనపై వచ్చే ట్రోల్స్‌పై వేగంగా స్పందిస్తుంటుంది గోవా భామ ఇలియానా. హద్దులు మీరి చేసే కామెంట్స్‌ను ధీటైన జవాబులిస్తుంది. సినిమాలపరంగా ఎలాంటి విమర్శల్ని అయినా స్వీకరిస్తానని, వ్యక్తిగతమైన ద్వేషాన్ని ఏమాత్రం ఉపేక్షించనని చాలా సందర్భాల్లో చెప్పిందీ అమ్మడు. ప్రస్తుతం ఆమె మాల్దీవుల్లో విహార యాత్రను ఆస్వాదిస్తున్నది. నీలి సంద్రం నడుమ ఆనందంగా గడుపుతూ అందుకు సంబంధించిన ఫొటోల్ని సోషల్‌మీడియాలో షేర్ చేస్తున్నది. ఈ క్రమంలో ఈ భామ విమర్శకుల్ని వ్యంగ్యంగా హెచ్చరిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ చేసింది. కళ్లు మూసుకొని ఉన్న ఓ ఫొటోను చూపిస్తూ ‘కళ్లు మూసుకున్నా కాబట్టి ఇప్పుడు నన్ను ద్వేషించేవారిని చూడలేను’ అని రాసుకొచ్చింది. తన శత్రువులకు హెచ్చరిక ఇదంటూ వ్యాఖ్యానించింది. మాల్దీవుల యాత్రకు సంబంధించిన ఈ ఫొటోల్లో ఇలియానా హాట్‌హాట్‌గా దర్శనమిస్తున్నది. గత కొంతకాలంగా సినిమాలకు విరామమిచ్చిన ఈ సొగసరి ఖాళీ సమయాల్ని విహార యాత్రలతో గడుపుతున్నది.