Ileana | గోవా బ్యూటీ ఇలియానా అందం, అభినయం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ బ్యూటీ టాలీవుడ్లో స్టార్ హీరోలతో కలిసి నటించి మంచి పేరు తెచ్చుకుంది. స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగింది. ఆ తర్వాత బాలీవుడ్‌కి వెళ్లి చేతులు కాల్చుకుంది. ఇక చేసేదేం లేక మైఖేల్ డోలన్ అనే వ్యక్తిని పెళ్లాడింది..ఇతను పోర్చ్గీసుకి చెందిన వ్యాపార వేత్త కాగా, అతనితో కొన్నాళ్లపాటు డేటింగ్ లో ఉండి ఆ తర్వాత వివాహం చేసుకొన్నారు. ప్రస్తుతం ఆమె పోర్చుగీస్ వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. డోలన్‌తో పెళ్లి తర్వాత ఈ జంటకి ఆగస్టు 2023 సంవత్సరంలో కొడుకు పుట్టాడు. ఇలియానా డోలన్కి ముందు ఆస్ట్రేలియన్ ఫోటోగ్రాఫర్ ఆండ్రూ నీబోన్‌తో సుదీర్ఘ కాలంగా అఫైర్ కొనసాగించింది. అయితే వారిద్దరూ 2019 లో అభిప్రాయ బేధాల కారణంగా బ్రేకప్ చెప్పుకొన్నారు.
ప్రస్తుతం మైఖేల్ డోలన్‌తో ఇలియానా సంతోషంగానే ఉంది. అయితే ఇటీవల కాలంలో ఆమె రెండోసారి గర్భం దాల్చిందనే వార్తలు వినిపించాయి. గత ఏడాది అక్టోబర్‌లో సెకండ్ ప్రగ్నెన్సీ విషయాన్ని తెలియజేసింది ఇలియానా. అయితే రీసెంట్గా ఆమె పండంటి బిడ్డకి జన్మనిచ్చినట్టు తెలుస్తుంది. ఫాదర్స్ డే రోజున ఇలియానా రెండో బిడ్డకు జన్మనిచ్చింది అని అంటున్నారు. అందుకు కారణం ఈ అమ్మడు తన సోషల్ మీడియాలో చిన్నారిని డోలన్ ముద్దాడుతున్న ఫోటోను షేర్ చేసింది. అది చూసి ఆ బిడ్డ అప్పుడే పుట్టినట్టుగా కనిపిస్తుందని, వారి బిడ్డే అని అంటున్నారు.
అయితే తమకు పుట్టిన బిడ్డ ఆడ పిల్లనా? మగ పిల్లాడా? అనే విషయాన్ని మాత్రం సీక్రెట్‌గా ఉంచారు. మరి ఈ విషయంపై పూర్తి క్లారిటీ ఎప్పుడు ఇస్తుందో చూడాలి. ఇక ఇలియానా కెరీర్ విషయానికి వస్తే.. దేవదాస్ సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆమె.. ఆ సినిమా హిట్ కావడంతో మంచి ఆఫర్స్ అందిపుచ్చుకుంది. తెలుగులోనే కాక తమిళం, హిందీ భాషల్లో బిజీగా మారిపోయింది. చివరిగా దో ఔర్ దో ప్యార్ అనే చిత్రంలో కనిపించింది ఇలియానా. కాగా, ప్రెగ్నెన్సీ కారణంగా పలు సినిమాలను వదులుకుంది ఇలియానా. అందులో అజయ్ దేవగన్‌తో కలిసి నటించాల్సిన రైడ్ 2 సినిమా ఒకటి. ఈ సినిమా కోసం ఆమెమెకు భారీ ఆఫర్ ఇచ్చారు. కానీ ప్రెగ్నెన్సీ వలన ఆ మూవీని వదులుకున్నదనే వార్తలు
నెట్టింట హల్చల్ చేశాయి.