Pushpa : The Rule | టాలీవుడ్లో రాబోతున్న మోస్ట్ ఎవెయిటెడ్ ప్రాజెక్టుల్లో ఒకటి పుష్ప.. ది రూల్ (Pushpa : The Rule). స్టార్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ (Allu Arjun) టైటిల్ రోల్ పోషిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఈ చిత్రంలో అల్లు అర్జున్ కజిన్ కీలక పాత్రలో కనిపించబోతున్నారన్న వార్త ఒకటి ఫిలింనగర్ సర్కిల్లో రౌండప్ చేస్తోంది.
ఇంతకీ ఎవరా వ్యక్తి అనే కదా మీ డౌటు. మరెవరో కాదు నిహారికా కొణిదెల (Niharika Konidela). గిరిజన యువతి పాత్ర కోసం సాయిపల్లవిని సంప్రదించగా.. సున్నితంగా తిరస్కరించినట్టు ఇప్పటికే ఓ టాక్ నడుస్తోంది. అయిదే ఇదే పాత్రలో ఇప్పుడు నిహారిక పేరును పరిశీలిస్తున్నారని జోరుగా చర్చ కొనసాగుతోంది. మరి ఈ క్రేజీ న్యూస్ నిజమవుతుందా..? లేదా.. ? అనేది చూడాలి. నిహారిక ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి చిత్రంలో మెరిసిన విషయం తెలిసిందే. మరి నిహారిక ప్రస్తుతం ప్రొఫెషనల్ కెరీర్‌పై ఫోకస్ పెట్టే పనిలో ఉండటంతో.. పుష్ప.. ది రూల్‌లో మెరిసే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయంటున్నారు సినీ జనాలు.
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో రాబోతున్న సీక్వెల్లో కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా మరోసారి శ్రీవల్లిగా సందడి చేయనుంది. సీక్వెల్లో మలయాళ స్టార్ యాక్టర్ ఫహద్ ఫాసిల్, సునీల్‌తోపాటు ఇతర నటీనటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సీక్వెల్‌కు కూడా సంగీతం అందిస్తున్నాడు.
పుష్పరాజ్ ఎక్కడ..?