Ibrahim Ali Khan to romance Sreeleela | తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం బిజీగా ఉన్న యంగ్ హీరోయిన్లలో టాప్‌లో ఉంటుంది శ్రీలీల (Sreeleela). చివరగా మహేశ్ బాబు నటించిన గుంటూరు కారంలో మెరిసిన ఈ భామ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్లో పెట్టింది. మరోవైపు రీసెంట్ పుష్ప 2 సినిమాలో కిస్సిక్ అంటూ స్పెషల్ సాంగ్ చేసి అభిమానులను అలరించింది. అయితే ఈ భామ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది.
తాజాగా శ్రీలీల బాలీవుడ్ అగ్ర నటుడు సైఫ్ అలీఖాన్ కొడుకు ఇబ్రహీం అలీఖాన్‌తో కలిసి ఒక రెస్టారెంట్లో దిగిన ఫొటోలు బయటకి వచ్చాయి. వీరిద్దరి రెస్టారెంట్ నుంచి బయటకు వచ్చిన అనంతరం మీడియాకి ఫోజులు ఇచ్చారు. సైఫ్ అలీఖాన్ కొడుకు ఇబ్రహీం అలీఖాన్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇబ్రహీం సినిమాలో శ్రీలీలను నటిగా ఎంపిక చేస్తున్నట్లు సమాచారం. కాగా ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరోవైపు శ్రీలీల ప్రస్తుతం నితిన్‌తో కలిసి రాబిన్ హుడ్, పవన్ కల్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాల్లో నటిస్తోంది. వీటితోపాటు RT75 ప్రాజెక్ట్‌లో ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది.
#IbrahimAliKhan and #Sreeleela after a script reading sesh! pic.twitter.com/CfCBwPO7hY
— BollyHungama (@Bollyhungama) January 7, 2025