తెలుగు, తమిళంలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న శృతిహాసన్ ప్రస్తుతం మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ నుంచి వస్తున్న రెండు భారీ ప్రాజెక్టుల్లో నటిస్తోందని తెలిసిందే. ఇప్పటికే బాలకృష్ణ నటిస్తున్న వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ఒంగోలుకు వెళ్లింది. అక్కడ శృతిహాసన్ (Shruti Haasan) స్పీచ్ కూడా తెగ వైరల్ అవుతోంది. కాగా ఇపుడు చిరంజీవి (Chiranjeevi) టైటిల్ రోల్ పోషిస్తున్న వాల్తేరు వీరయ్య (Waltair Veerayya)లో ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తుందని తెలిసిందే. అయితే ఈవెంట్‌కు శృతిహాసన్ రావడం లేదు.
ఈవెంట్‌కు ఎందుకు రాలేకపోతుందో అందరితో షేర్ చేసుకుంది. అనారోగ్యం కారణంగా వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు రాలేకపోతున్నా. అందుకు నా గుండె పగిలిపోయినట్టు అనిపిస్తుంది. చిరంజీవిగారితో పనిచేయడం చాలా గౌరవంగా ఫీలవుతున్నా. టీం అందరికీ ఆల్ ది బెస్ట్ అంటూ సోషల్ మీడియాలో సందేశాన్ని పోస్ట్ చేసింది శృతిహాసన్. వైజాగ్‌లోని ఏయూ కాలేజ్ గ్రౌండ్స్ లో గ్రాండ్‌గా ఈవెంట్ కొనసాగుతుంది. చిరంజీవితోపాటు రవితేజ, దేవీ శ్రీ ప్రసాద్, మైత్రీ మూవీ మేకర్స్ ఇప్పటికే వైజాగ్‌కు చేరుకున్నారు.
బాబీ (కేఎస్ రవీంద్ర) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రవితేజ కీ రోల్ పోషిస్తున్నాడు. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నాడు. సంక్రాంతి కానుకగా జనవరి 13న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది వాల్తేరు వీరయ్య. ఇప్పటికే విడుదలైన బాస్ పార్టీ సాంగ్‌తోపాటు మిగిలిన పాటలు, టైటిల్ టీజర్, ట్రైలర్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.
Team #WaltairVeerayya lands in Vizag for the MEGA MASS PARTY in style 😎🔥
Grand Pre-Release Event from 6 PM onwards🔥
📍AU Grounds,Vizag!Watch Live!
– https://t.co/ELAotvi8oVMega⭐ @KChiruTweets @RaviTeja_offl @dirbobby @shrutihaasan @ThisIsDSP @MythriOfficial @MediaYouwe pic.twitter.com/3DvGAD5Pi4
— SivaCherry (@sivacherry9) January 8, 2023
ఎయిర్‌పోర్టులో వాల్తేరు వీరయ్య టీం..
Megastar @KChiruTweets, Mass Maharaja @RaviTeja_offl & Team #WaltairVeerayya leaves to Vizag for the MEGA MASS PARTY 🤩🤩
Grand Pre-Release Event at AU Grounds begins from 6PM onwards 💥
– https://t.co/m5cBtOhaGv@dirbobby @shrutihaasan @ThisIsDSP @MythriOfficial @MediaYouwe pic.twitter.com/h3goRwKYi1
— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) January 8, 2023
వాల్తేరు వీరయ్య ట్రైలర్ ..
వాల్తేరు వీరయ్య టైటిల్ ట్రాక్ ..
వాల్తేరు వీరయ్య టైటిల్ టీజర్..
బాస్ పార్టీ లిరికల్ వీడియో సాంగ్..