టాలీవుడ్ (Tollywood) డైరెక్టర్ దేవాకట్టా (Deva Katta) దర్శకత్వంలో వచ్చిన చిత్రం రిపబ్లిక్ (Republic). సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej) హీరోగా నటించిన రిపబ్లిక్ కు బాక్సాపీస్ వద్ద మంచి టాక్ వస్తోంది. సాయిధరమ్ నటనకు ప్రేక్షకులు ప్రశంసలు దక్కుతున్నాయి. రిపబ్లిక్ సినిమాపై ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రశంసలు కురిపించారు.
రిపబ్లిక్ సినిమాపై కొన్ని రివ్యూలు విన్నా. దేవాకట్టా, సాయిధరమ్ తేజ్ కాంబినేషన్ లో వచ్చిన రిపబ్లిక్ చిత్రాన్ని చూసేందుకు ఎదురుచూస్తున్నా..అంటూ లోకేశ్ ట్వీట్ చేశాడు. సాయిధరమ్ తేజ్ త్వరగా కోలుకుని, ఆరోగ్యంగా తిరిగి రావాలని ఆకాంక్షించారు నారా లోకేశ్. ఈ చిత్రంలో ఐశ్వర్యారాజేశ్ ఫీ మేల్ లీడ్ రోల్ పోషించింది. రమ్యకృష్ణ, జగపతిబాబు, సుబ్బరాజు ఇతర కీలక పాత్రల్లో నటించారు.
Hearing some great reviews about #RepublicMovie. Looking forward to watch @devakatta and @iamsaidharamtej’s phenomenal work soon. Wishing Tej a speedy recovery and good health! #REPUBLIC pic.twitter.com/6KahQSnA8c
— Lokesh Nara (@naralokesh) October 3, 2021
రిపబ్లిక్ చిత్రాన్ని జేబీ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్‌పై జీ స్టూడియోస్ తో కలిసి జే భగవాన్, జే పుల్లారావు నిర్మించారు. మణిశర్మ మ్యూజిక్ డైరెక్టర్. ప్రజాస్వామ్య వ్యవస్థలోని శాసన, కార్యనిర్వాహక, న్యాయవ్యవస్థ లను సృశిస్తూ సాగుతుంది రిపబ్లిక్.
Manoj Bajpayee: మరో విషాదం.. మనోజ్ బాజ్‌పేయ్ తండ్రి మృతి
Mahesh: స్పెయిన్ షెడ్యూల్ ప్లాన్ చేసిన సర్కారు వారి పాట టీం..!
Chiranjeevi | గర్వంగా చెబుతున్నా అది నా సొంత డబ్బు: చిరంజీవి