Nandamuri Balakrishna Black Dress | డాకు మహరాజ్(Daaku Maharaaj) సక్సెస్‌తో ఫుల్ జోష్‌లో ఉన్నాడు నటుడు నందమూరి బాలకృష్ణ. వీరసింహరెడ్డి, భగవంత్ కేసరిల తర్వాత హ్యట్రిక్ హిట్ అందుకున్నాడు. యాక్షన్ ఎంటర్టైనర్గా వచ్చిన డాకు సినిమాకి.. బాబీ దర్శకత్వం వహించగా.. సితార ఎంటర్టైనమెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మించాడు. శ్రద్ధ శ్రీనాథ్, పగ్వా జైశ్వల్, ఊర్వశీ రౌతేలా కథానాయికలుగా నటించారు. జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం పాజిటివ్ టాక్‌తో దూసుకుపోవడమే కాకుండా.. రూ.130 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.
అయితే ఈ సినిమా విజయం సాధించిన సందర్భంగా బాలకృష్ణ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన గురించి ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు. బాలకృష్ణ మాట్లాడుతూ.. తాను ఆదివారం నలుపు రంగు బట్టలు(Black Color Dress) వేసుకోనని తెలిపాడు. నాది మూల నక్షత్రం (Moola Nakshatra) అందుకే ఆదివారం నలుపు రంగు ధరిస్తే.. నాకు చాలా డేంజర్. ఇలా వేసుకొని ఒకసారి ప్రమాదంకి కూడా గురయ్యాను. ఎస్పీ బాలసుబ్రమణ్యం(SPB) ఆదిత్య 369 సినిమాకు నిర్మాతగా వ్యవహరించాడు. ఈ షూటింగ్ సమయంలో ఆరోజు ఆదివారం నేను బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకుని వెళ్లాను. ఆరోజు నా నడుముకి దెబ్బ తాకింది. దీంతో ఆయన వలనే జరిగింది అనుకొని ఎస్పీబీ ఇప్పటివరకు షూటింగ్ స్పాట్‌కి రాలేదు. నేను కూడా నలుపు రంగు ధరించాను కాబట్టే ఇలా అయ్యిందని అప్పటినుంచి వేసుకోట్లేదు అంటూ బాలయ్య చెప్పుకోచ్చాడు.