టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) అతి త్వరలోనే వాల్తేరు వీరయ్య (Waltair Veerayya)గా అలరించేందుకు రెడీ అవుతున్నాడు. ఆదివారం వైజాగ్‌లోని ఏయూ కాలేజ్ గ్రౌండ్స్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడిన మాటలు వైజాగ్ వాసుల్లో ఫుల్ జోష్ నింపుతున్నాయి.
ఈవెంట్లో చిరంజీవి మాట్లాడుతూ.. నేను వైజాగ్ నివాసితుడిని కావాలని చాలా కాలంగా ఓ కోరిక ఉంది. ప్రస్తుతం ఆ దిశగా ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నా. వైజాగ్‌లో కొంత భూమి కొనుగోలు చేశా. త్వరలోనే ఆ స్థలంలో నా ఇల్లు నిర్మాణం చేయబోతున్నా. వైజాగ్‌లో ఇల్లు ఏర్పాటు చేసుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది.. అని చెప్పుకొచ్చాడు చిరంజీవి.
ఇదిలా ఉంటే తెలుగు సినీ పరిశ్రమను వైజాగ్‌లో విస్తరించడంలో భాగంగా..సినిమా షూటింగ్స్ పూర్తి స్థాయిలో జరుపుకునే దిశగా ఏపీ ప్రభుత్వం ఇప్పటికే ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. వైజాగ్‌లో చిరంజీవి ఇంటి నిర్మాణం నేపథ్యంలో అక్కడి ప్రభుత్వానికి కూడా ఇండస్ట్రీ డెవలప్మెంట్పై ఫోకస్ పెట్టడం సులభం కానుంది.
చిరంజీవికి కెరీర్ తొలినాళ్ల నుంచి వైజాగ్‌తో మంచి అనుబంధం ఉందని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. చిరు కెరీర్లో బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన చాలా చిత్రాలు వైజాగ్‌లో షూటింగ్ జరుపుకున్నాయి. తనకిష్టమైన వైజాగ్ సిటీకి షూటింగ్స్ కోసం షెడ్యూల్ ప్రకారం వచ్చి వెళ్లే చిరంజీవి ఇక సొంత గూడు ఏర్పాటు చేసుకుంటుండటంతో.. ఇక నుంచి ఎక్కువ సమయం అక్కడే ఉండే అవకాశాలు లేకపోలేదంటున్నారు సినీ జనాలు.
వాల్తేరు వీరయ్య ట్రైలర్ ..
వాల్తేరు వీరయ్య టైటిల్ ట్రాక్ ..
వాల్తేరు వీరయ్య టైటిల్ టీజర్..
బాస్ పార్టీ లిరికల్ వీడియో సాంగ్..