Deepika Padukone | అమ్మతనాన్ని పరిపూర్ణంగా అనుభవించడం అదృష్టం. ఆ అదృష్టానికి దూరం కాను. నా తల్లి నన్నెలా సాకిందో, నేనూ నా బిడ్డను అలానే సాకుతా. నా బిడ్డకు అమ్మ ప్రేమను సంపూర్ణంగా అందిస్తా.’ అంటున్నది బాలీవుడ్ లేడీ సూపర్‌స్టార్ దీపికా పదుకొణె. ఈ నెల 8న ఆమె పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. తన బేబీ పెంపకం విషయంలో దీపిక ఓ బలమైన నిర్ణయాన్ని తీసుకున్నదట. సాధారణంగా సెలబ్రిటీలూ.. తమ పిల్లల్ని చూసుకునేందుకు ఎక్కువ మొత్తంలో డబ్బు వెచ్చించి, నానీ(ఆయమ్మ)లను నియమిస్తుంటారు.
కానీ దీపిక.. అలాంటి వాటికి తాను పూర్తి విరుద్ధమని తేల్చి చెప్పేసిందట. ‘ఐశ్వర్యరాయ్, అనుష్కశర్మ కూడా తమ బిడ్డలను ఆయమ్మల సహాయం లేకుండానే పెంచుకున్నారు. నేనూ వారి దారిలోనే పయనిస్తా. నా బిడ్డను నేనే పెంచుతా. కెరీర్ కూడా దాని తర్వాతే.’ అని పేర్కొన్నదట దీపిక. అంతేకాదు, తన పాపను ఫొటోలకు కూడా దూరంగా ఉంచాలని ఆమె నిర్ణయం తీసుకున్నదట. సరైన సమయం వచ్చినప్పుడే తమ బిడ్డను ప్రపంచానికి పరిచయం చేయాలని దీపిక దంపతులు భావిస్తున్నారని బాలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.