Anupam Kher | బాలీవుడ్ నుంచి చిన్న సినిమాగా వచ్చి బ్లాక్ బస్టర్‌గా నిలిచిన చిత్రం సైయారా. ఈ సినిమాకు మోహిత్ సూరి దర్శకత్వం వహించగా.. ఆహాన్ పాండే, అనిత్ పడ్డా హీరోహీరోయిన్లుగా బాలీవుడ్‌కి పరిచయం అయ్యారు. రూ.50 బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం దాదాపు రూ.500 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది మంచి హిట్‌ను అందుకుంది. అయితే ఈ సినిమా విజయం సాధించడం పట్ల తాను బాధపడినట్లు తెలిపాడు బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్.
‘సైయారా’ విడుదలైన రోజే నా సినిమా ‘తన్వీ ది గ్రేట్’ (Tanvi the Great) కూడా విడుదలైంది. అయితే సైయారాకు వచ్చిన టాక్ ముందు తన సినిమా నిలవలేకపోయిందని తెలిపాడు ఖేర్. ఈ సినిమా కోసం నేను నాలుగేండ్లు కష్టపడ్డాను. అయిన కూడా ఒక్కసారిగా డిజాస్టార్‌గా నిలిచేవరకు నాతో పాటు నా టీమ్ అంతా బాధలో ఉండిపోయాం. ఈ సినిమా భారీ బడ్జెట్ సినిమా కావడంతో చాలా మందిని సంప్రదించాను. నాకు తెలిసిన వారు సాయం చేశారు. ఈ సినిమాను అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించడంతో పాటు భారత రాష్ట్రపతికి కూడా చూపించాను. సినిమా చూసిన వారందరూ ప్రశంసించారు. కానీ ప్రేక్షకులు మాత్రం ఈ సినిమాను పట్టించుకోలేదంటూ అనుపమ్ వెల్లడించారు.