Gandeevadhari Arjuna | టాలీవుడ్ యాక్టర్ వరుణ్‌తేజ్ (Varun Tej) బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడని తెలిసిందే. వీటిలో ఒకటి VT 12 ప్రాజెక్ట్‌గా వస్తున్న గాండీవధారి అర్జున (Gandeevadhari Arjuna). మేకర్స్ ఇప్పటికే లాంఛ్ చేసిన ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్, గ్లింప్స్, టీజర్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ది ఘోస్ట్ ఫేం ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్న గాండీవధారి అర్జున ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది.
ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది వరుణ్ తేజ్ టీం. ఈ సందర్భంగా మీడియాతో చేసిన చిట్‌చాట్‌లో వరుణ్ తేజ్ మాట్లాడుతూ.. తాను ఈ చిత్రంలో ప్రైవేట్ సెక్యూరిటీ బాడీగార్డ్‌గా నటించానన్నాడు. గాండీవధారి అర్జునలో గ్లోబల్ వార్మింగ్, దాని పర్యావసానాలు, పలు భావోద్వేగాలను ప్రవీణ్ సత్తారు అద్భుతంగా చూపించారు. యాక్షన్ పార్టును పూర్తిగా సరికొత్త పంథాలో డిజైన్ చేశారని చెప్పుకొచ్చాడు.
ఈ చిత్రంలో బుడాపెస్ట్‌లో వచ్చే హై ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్స్ సినిమాకే హైలెట్‌గా నిలువబోతున్నట్టు టీజర్, ట్రైలర్‌తో క్లారిటీ ఇచ్చేశాడు డైరెక్టర్. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. యాక్షన్ జోనర్లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. ఈ చిత్రంలో ఏజెంట్ ఫేం సాక్షి వైద్య ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తుండగా.. విమలారామన్, నాజర్, వినయ్ రాయ్ ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీలో హీరోహీరోయిన్ల మధ్య వచ్చే నీ జతై లిరికల్ వీడియో సాంగ్ మ్యూజిక్ లవర్స్‌ను ఇంప్రెస్ చేస్తోంది.
వరుణ్ తేజ్ మరోవైపు శక్తి ప్రతాప్ సింగ్ హడ దర్శకత్వంలో VT13లో కూడా నటిస్తున్నాడు. వార్ డ్రామా నేపథ్యంలో పాన్ ఇండియా కథాంశంతో తెరకెక్కుతున్న ఈ మూవీలో వరుణ్ తేజ్ ఫైటర్ పైలట్‌గా నటిస్తుండగా.. మాజీ మిస్ యూనివర్స్ మానుషి ఛిల్లార్ (Manushi Chhillar) ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది.
గాండీవధారి అర్జున ట్రైలర్..
గాండీవధారి అర్జున టీజర్..
నీ జతై మెలోడీ ట్రాక్..