ఒకప్పుడు తెలుగు తెరపై యువతరం కలల రాణిగా భాసిల్లింది జెనీలియా. చూడముచ్చటైన అందంతో కాస్త అమాయకత్వం, చలాకీతనం కలబోసిన పాత్రల ద్వారా ఫ్యామిలీ ఆడియెన్స్‌కు బాగా చేరువైంది. ముఖ్యంగా ‘బొమ్మరిల్లు’లో ఆమె పోషించిన హాసిని పాత్ర అందరికి గుర్తుండిపోయింది. వివాహానంతరం సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తున్న జెనీలియా.. దాదాపు 13ఏళ్ల విరామం తర్వాత దక్షిణాదిలో రీఎంట్రీ ఇస్తూ నటించిన చిత్రం ‘జూనియర్’. కిరీటి రెడ్డి హీరోగా పరిచయమవుతున్న ఈ చిత్రానికి రాధాకృష్ణ దర్శకుడు. ఈ నెల 18న విడుదలకానుంది. ఈ సినిమాలో జెనీలియా కీలక పాత్రలో నటించింది. ఈ సందర్భంగా మంగళవారం ఆమె విలేకరులతో ముచ్చటిస్తూ పంచుకున్న విశేషాలు..