Alia Bhatt | బాలీవుడ్ నటి ఆలియా భట్ ఒకవైపు సినిమాలు చేస్తునే మరోవైపు తన కూతురు రాహాతో సమయం గడపడమే కాకుండా తన గురించి ఆసక్తికరమైన విషయాలను సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటుంది. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గోన్న ఈ అమ్మడు తన సినిమాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇప్పటివరకు నేను చేసిన సినిమాల్లో ఏదీ కూడా నా కూతురు చూసేలా లేదని ఆలియా తెలిపింది. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ నుంచి మొదలుకొని, గల్లీ బాయ్, గంగూబాయి కతియావాడి, రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ వంటి సినిమాలు నా కూతురు చూసేటంత వయసులో లేదు. తన కోసం కొత్తగా సినిమాలు చేయాలి. తాను నవ్వుకునే సినిమాలు చేయాలని అనుకుంటున్నాను అంటూ ఆలియా తెలిపింది. అంతేగాకుంగా.. తన భర్త నటించిన ‘బర్ఫీ’ సినిమా రాహా చూడగలిగేలాగా ఉంటుందని.. ఆ చిత్రం సరదాగా.. సున్నితంగా ఉంటుందని తెలిపింది.
ఆలియా సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ‘లవ్ అండ్ వార్’ (Love & War) అనే సినిమాలో తన భర్త రణ్‌బీర్ కపూర్‌తో నటిస్తుంది. ఈ సినిమా విక్కీ కౌశల్ కీలక పాత్రలో నటిస్తుండగా.. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహిస్తున్నాడు.