Rangabali | టాలీవుడ్ యువ హీరో నాగశౌర్య (Naga Shaurya) నటిస్తోన్న తాజా చిత్రం రంగబలి (Rangabali). డెబ్యూ డైరెక్టర్ పవన్ బసంశెట్టి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. జులై 7న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో నాగశౌర్య టీం ప్రమోషన్స్‌లో ఫుల్ బిజీగా ఉంది. ప్రమోషన్స్‌లో భాగంగా నాగశౌర్య మీడియాతో చిట్ చాట్ చేశారు. చిట్ చాట్ సెషన్లో సినిమా విశేషాలను పంచుకున్నాడు. రంగబలి విశేషాలు నాగశౌర్య మాటల్లోనే..
రంగబలి గురించి ఏం చెప్తారు..?
ఓ వ్యక్తి స్వస్థలం నేపథ్యంలో సాగే స్టోరీ. ఎక్కడున్నావ్, ఏం చేస్తున్నావ్, మీ ఊరుతో ఎప్పుడూ ఓ కనెక్షన్ ఉంటుంది. మీ సొంతిల్లులా భావిస్తారు. ఒకవేళ ఎవరైనా ధనవంతుడు మీ ముందు నిలబడినా మీరు ఈ ఛాలెంజ్ చేయొచ్చు. సినిమా బాగా వచ్చింది. ప్రతీ ఒక్కరూ సినిమాను ఎంజాయ్ చేస్తారని చెప్పగలను. మ్యూజిక్, రీరికార్డింగ్ మిమ్మల్ని అబ్బురపరుస్తుంది.
సినిమాపై చాలా కాన్ఫిడెంట్‌గా కనిపిస్తున్నారు..?
కంటెంట్‌లో క్వాలిటీగా ఉంటుంది. సినిమాకు సంబంధించిన ప్రతీ ఒక్క విషయం ప్రేక్షకులకు వినోదాన్ని అందించడమే కాదు, బ్లాక్ బస్టర్ చేయడానికే. అందుకే సినిమాను ప్రమోట్ చేసే బాధ్యత తీసుకున్నా. రంగబలి మీ అంచనాలకు తప్పకుండా చేరుకుంటుందని నమ్ముతున్నా.
డైరెక్టర్ గురించి..
డైరెక్టర్ పవన్ బసంశెట్టికి నా నుంచి సినిమా కోసం ఏం కావాలో, ఏం రాబట్టుకోవాలో బాగా తెలుసు. తన క్రాఫ్ట్‌ను చాలా బాగా హ్యాండిల్ చేశాడు. టాలీవుడ్లో అతనికి మంచి భవిష్యత్ ఉంది.
హీరోయిన్ యుక్తి తరేజాతో పనిచేయడం ఎలా ఉంది..?
యుక్తి తరేజా చాలా కష్టపడేతత్వం ఉన్న నటి. ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్‌కు కావాల్సిన అన్ని క్వాలిటీస్ ఆమెలో ఉన్నాయి. అంతేకాదు ఆమె అద్బుతమైన డ్యాన్సర్. ఈ సినిమాకు ఆమెతో కలిసి పనిచేయడాన్ని చాలా ఎంజాయ్ చేశా. ఆమె అద్భుతమైన కోస్టార్.
మీ కొత్త సినిమాల మాటేంటి..?
నా 24వ సినిమా ప్రస్తుతం ప్రొడక్షన్ దశలో ఉంది. మొదటి షెడ్యూల్ పూర్తయింది. రంగబలి విడుదలయ్యాక సెకండ్ షెడ్యూల్ మొదలుపెడతాం. ప్రస్తుతానికి బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చే ప్లాన్స్ ఏం లేవు. నా సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ను రాబోయే రోజుల్లో చెప్తా.
నాగశౌర్య చిట్ చాట్ ఫొటోలు..
Stylish #NagaShaurya @IamNagashaurya 📸📸 #RangabalionJuly7th #Rangabali @SLVCinemasOffl pic.twitter.com/g3IyR6q3ar
— BA Raju’s Team (@baraju_SuperHit) July 5, 2023
రంగబలి టీజర్..
రంగబలి ట్రైలర్..
కల కంటు ఉంటే ఫుల్ లిరికల్ వీడియో సాంగ్..
కల కంటు ఉంటే సాంగ్ ప్రోమో..
మన ఊరిలో లిరికల్ వీడియో సాంగ్..