Meenakshi Chaudhary Crush | నటి మీనాక్షి చౌదరి(Actress Meenakshi Chaudhary) ఈ మధ్య వరుసగా హిట్లు అందుకుంటుంది. గతేడాది విజయ్ గోట్, లక్కీ భాస్కర్‌తో హిట్లు అందుకున్న ఈ భామ తాజాగా సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki Vasthunam) అనే సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. విక్టరీ వెంకటేష్(Victory Venkatesh) కథానాయకుడిగా వచ్చిన ఈ సినిమాను అనిల్ రావిపూడి(Anil Ravipudi) దర్శకత్వం వహించారు. దిల్ రాజు ఈ సినిమాను నిర్మించాడు. జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. ఈ సందర్భంగా మూవీ సక్సెస్‌కి సంబంధించి ఇంటర్వ్యూ నిర్వహించింది చిత్రయూనిట్.
అయితే ఈ ఇంటర్వ్యూలో మీనాక్షి చౌదరి మాట్లాడుతూ.. తనకు స్కూల్ టైంలో ఒక టీచర్ మీదా క్రష్ ఉండేదని చెప్పుకోచ్చింది. మనందరికీ స్కూల్ లేదా కాలేజీ టైంలో క్రష్ ఉంటుందని.. ఇది అబ్బాయిలకే కాదు అమ్మాయిలకు కూడా ఇలా ఉంటుంది. నాకు కూడా నా స్కూల్ టైంలో ఒక టీచర్ మీదా క్రష్ ఉండేదని అతడంటే చాలా ఇష్టమని మీనాక్షి తెలిపింది. కాగా ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
“I have the biggest crush on my school teacher,” says #MeenakshiChaudhary. pic.twitter.com/EfjsSaZ5Q0
— Movies4u Official (@Movies4u_Officl) January 19, 2025