Bellamkonda Ganesh | అప్పుడే ఇండస్ట్రీలోకి రావాలనుకున్నా..కథను చాలా ఎంజాయ్ చేశా..స్వాతిముత్యం హీరో
లక్ష్మణ్ కే కృష్ణ దర్శకత్వంలో వర్ష బొల్లమ్మ హీరోయిన్ గా నటిస్తున్న స్వాతిముత్యం (Swathi Muthyam) చిత్రం అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో హీరో గణేశ్ మీడియాతో చిట్ చాట్ చేశాడు.
బెల్లంకొండ గణేశ్ (Bellamkonda Ganesh) హీరోగా ఎంట్రీ ఇస్తున్న తాజా చిత్రం స్వాతిముత్యం (Swathi Muthyam). లక్ష్మణ్ కే కృష్ణ దర్శకత్వంలో వర్ష బొల్లమ్మ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంఅక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో హీరో గణేశ్ మీడియాతో చిట్ చాట్ చేశాడు.
2016లో నేను ఇండస్ట్రీలోకి రావాలని నిర్ణయించుకున్నా. నా స్నేహితుల సాయంతో లక్ష్మణ్ కే కృష్ణ నాకు కథ వినిపించారు. కథ చెప్తున్నంత సేపు చాలా నవ్వుతూ ఎంజాయ్ చేశా. ఆ తర్వాత మేం నిర్మాత నాగవంశీని కలిశాం. ఆయనకు కూడా బాగా నచ్చడంతో సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో నా పాత్ర పేరు బాలమురళి కృష్ణ. చాలా అమాయకంగా కనిపిస్తా. నా నిజజీవిత పాత్రకు భిన్నంగా ఉంటుంది. అంతకుమించి నా క్యారెక్టర్ గురించి చెప్పలేను. ప్రేక్షకులకు సిల్వర్ స్క్రీన్‌పై చూసి ఎంజాయ్ చేయాలని భావిస్తున్నానన్నాడు.
విక్కీ డోనర్‌తో పోలికలుండవు…
విక్కీడోనర్ సినిమాతో పోలికలుండవు. మీరు చెప్పిన పాయింట్‌ను తీసుకున్నాం. కానీ కథ ఆ అంశం చుట్టూ తిరగదు. పరిస్థితులకు అనుగుణంగా జరిగి కామెడీ సన్నివేశాలతో ప్రేక్షకులను నవ్వించడం ఖాయం. వర్షబొల్లమ్మ అద్బుతమైన నటి. ఆమె చాలా బాగా ప్రిపేర్ సెట్స్‌కి వస్తారు. సెట్స్‌లో చాలా సరదాగా ఉండటమే కాదు..సాయం కూడా చేస్తారు. వర్షతో పనిచేయడం చాలా బాగా ఎంజాయ్ చేశా.
కొత్త సినిమాల గురించి..డిఫరెంట్ జోనర్లలో విభిన్నపాత్రలు చేయాలనుంది. నా తదుపరి సినిమా నేను స్టూడెంట్ సార్. థ్రిల్లర్ జోనర్లో వస్తున్న ఈ చిత్రం రెండు నెలల్లో విడుదల కాబోతుంది.
వారు ఎలాంటి సూచనలివ్వలేదు…
సినిమా మొదలైన తర్వాత అన్నయ్య, నాన్న నాకు నటనకు సంబంధించి ఎలాంటి సూచనలు ఇవ్వలేదు. చిత్ర నిర్మాణంలో కూడా ఎప్పుడూ జోక్యం చేసుకోలేదు. నాతోపాటు కుటుంబసభ్యులు కూడా ఇంకా సినిమా చూడలేదు. ఇవాళ రాత్రి సినిమా చూస్తాం..అని చెప్పాడు.
Read Also : Hari Hara Veera Mallu | స్పీడు పెంచిన క్రిష్..‘హరిహర వీరమల్లు’పై తాజా అప్డేట్
Read Also : O Pari music video | దేవీ శ్రీ ప్రసాద్ పాన్ ఇండియా మ్యూజిక్ వీడియో అదిరింది..
Read Also : Chiranjeevi Fans | వాయిస్ ఓవర్ బాగుంది సార్..పూరీకి ఒక్క సినిమా ఇవ్వండి..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
Prabhas | ప్రభాస్ కొత్త లైనప్.. ‘మిరాయ్’ దర్శకుడితో రెబల్ స్టార్ నెక్స్ట్ మూవీ?
High Fibre Jelly | జీర్ణక్రియకు మేలు చేసే ఫైబర్ జెల్లీ.. తయారీ ఇలా..
Arrest | ముంబైలో అనుమానిత జైషే మహమ్మద్ ఉగ్రవాది అరెస్ట్..!
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

