Shekar Kammula | రామ్ గోపాల్ వర్మ – నాగార్జున కాంబినేషన్లో వచ్చిన కల్ట్ క్లాసిక్ చిత్రం శివ. ఈ సినిమాను మళ్లీ రీ రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్. నవంబర్ 14న ఈ సినిమా రీరిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో శివ సినిమా రోజులను గుర్తుచేసుకుంటూ పలువురు సినీ ప్రముఖులు తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. తాజాగా దర్శకుడు శేఖర్ కమ్ముల కూడా శివ రోజులను గుర్తు చేసుకోగా.. అన్నపూర్ఱ స్టూడియోస్ ఈ వీడియోను వదిలింది.
శివ సినిమాతో నాకు చాలా జ్ఞాపకాలు ఉన్నాయి. ఈ సినిమా షూటింగ్ మా ఇంటి దగ్గర్లోనే జరిగింది. నాగార్జున షూటింగ్ వచ్చాడంటే అందరం వెళ్లేవాళ్లం కానీ అప్పటికి దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అంటే ఎవరికి తెలియదు. శివ సినిమాను నేను క్రాస్ రోడ్స్‌లో చూశాను. చూసిన తర్వాత అందరిలాగానే నేను కూడా షాక్ అయ్యాను. శివ సినిమాతో నాగార్జున మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చాడని చెప్పవచ్చు. తెలుగు సినిమా శివ ముందు శివ తర్వాత(Before Shiva After Shiva) అని చెప్పవచ్చు. ఈ సినిమాను ఎన్నిసార్లు చూసిన ట్రూ క్లాసిక్ మాస్టర్‌పీస్ అనే ఫీలింగ్‌ను ఇస్తుంది. ఈ సినిమా రీ రిలీజ్ కాబోతుండటం చాలా ఆనందంగా ఉందంటూ శేఖర్ చెప్పుకోచ్చాడు.