Samantha | తన యాక్టింగ్, డ్యాన్స్‌తో సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది స్టార్ హీరోయిన్ సమంత (Samantha). టాలీవుడ్లో వన్ ఆఫ్ ది లీడింగ్ హీరోయిన్గా కొనసాగుతున్న ఈ చెన్నై సుందరి పుష్పలో ఐటెంసాంగ్ ఊ అంటావా మావా ఊఊ అంటావా (Oo Antava Oo Oo Antava)లో హాట్ హాట్ స్టెప్పులతో అలరించిన విషయం తెలిసిందే. ఈ పాట బాక్సాఫీస్‌ను ఏ రేంజ్లో షేక్ చేసిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అక్కినేని నాగచైతన్య నుంచి విడిపోయిన తర్వాత వెంటనే ఈ పాటకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.
అయితే ఈ సాంగ్‌లో సమంత సూపర్ హాట్‌గా ఉందంటూ చాలా మంది అంటే.. మరికొంతమంది ఇలాంటి పాట చేయడమేంటని ట్రోల్స్ కూడా చేశారు. అయితే తాజాగా ట్రోల్స్‌పై స్పందించింది సామ్. తాను కేవలం చైతూ నుంచి విడిపోతున్నట్టు మాత్రమే ప్రకటించడం వల్ల.. నా కుటుంబసభ్యులు, స్నేహితులు ఐటెం సాంగ్ చేయొద్దని సలహా ఇచ్చారని చెప్పుకొచ్చింది. నేనేం తప్పు చేయలేదు. నా పెళ్లికి 100 శాతం న్యాయం చేశా. కానీ అది వర్కవుట్ కాలేదు. నన్ను ఇంట్లో కూర్చొమన్నారు. ఇంట్లోనే కూర్చొనేంత నేరం నేనేమి చేయలేదు. నేనెప్పుడూ ఐటెం సాంగ్ చేయలేదు. పాటలో (లిరిక్స్) సాహిత్యం నచ్చడం వల్లే అందరూ చేయకూడదని చెప్పినా పుష్ప పాట చేశానని చెప్పుకొచ్చింది సమంత.
యశోద సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న సమంత ప్రస్తుతం గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం సినిమా చేస్తోంది. శాకుంతలం ఏప్రిల్ 14న థియేటర్లలో సందడి చేయనుంది. మరోవైపు విజయ్ దేవరకొండతో కలిసి ఖుషి సినిమాలో నటిస్తోంది. శివనిర్వాణ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ సెప్టెంబర్ 1న విడుదల కానుంది.