48గంటల్లో జరిగే ఫిక్షన్ డ్రామా
‘అయిదుగురు స్నేహితుల్లో ఒకడు ఓ ఇన్సిడెంట్లో చనిపోతాడు. మిగతా నలుగురూ ఆ సిట్యువేషన్‌ను ఎలా హ్యాండిల్ చేశారు? పోలీసుల నుంచి ఎలా తప్పించుకున్నారు.? ఒకవేళ అరెస్ట్ అయితే ఎలా బయటపడ్డారు? అనే ఆసక్తికరమైన ప్రశ్నల సమాహారం ఈ సినిమా.
‘అయిదుగురు స్నేహితుల్లో ఒకడు ఓ ఇన్సిడెంట్లో చనిపోతాడు. మిగతా నలుగురూ ఆ సిట్యువేషన్‌ను ఎలా హ్యాండిల్ చేశారు? పోలీసుల నుంచి ఎలా తప్పించుకున్నారు.? ఒకవేళ అరెస్ట్ అయితే ఎలా బయటపడ్డారు? అనే ఆసక్తికరమైన ప్రశ్నల సమాహారం ఈ సినిమా. నిజంగా జరిగిన సంఘటన ఆధారంగా తెరకెక్కిన సినిమా ఇది. నాక్కూడా ఈ తరహా కథలంటే ఇష్టం. వినగానే నచ్చేసింది. అందుకే ఒప్పుకున్నా’ అని ‘బిగ్‌బాస్’ ఫేం రవికృష్ణ అన్నారు. ఆయన కథానాయకుడిగా నటించిన థ్రిల్లర్ మూవీ ‘ది బర్త్‌డే బాయ్’. సమీర్ మళ్లా, రాజీవ్ కనకాల కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి విస్కీ దర్శకుడు. ఐ.భరత్ నిర్మాత. ఈ నెల 19న సినిమా విడుదల కానుంది.
ఈ సందర్భంగా ఆదివారం రవికృష్ణ విలేకరులతో ముచ్చటించారు. ‘నా ఫైనల్ గోల్ సినిమాల్లో నటించడం. నాకు సినిమాలంటే పిచ్చి. అన్ని తరహా పాత్రలు చేసి నటుడిగా గుర్తింపు తెచ్చుకోవడం నా ఆశయం. అందుకే మంచి అవకాశాలకోసం ఎదురుచూశా. ‘విరూపాక్ష’ తర్వాత అవకాశాలు బాగా వస్తున్నాయి. ఇందులో ఐదుగురు స్నేహితుల్లో ఒకడి సోదరుడి పాత్ర నాది. ఫుల్‌లెంగ్త్ ఉంటుంది. ఒక ట్రూ ఎమోషన్, ట్రూ డ్రామా తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తుంది. 48 గంటల్లో జరిగే ఈ కథలో ఫిక్షన్ డ్రామా ఉత్కంఠభరితంగా ఉంటుంది.’ అని తెలిపారు రవికృష్ణ. వందకోట్ల ‘విరూపాక్ష’లో కీలక పాత్ర పోషించడం తన అదృష్టమని, ఆ సినిమా టైమ్‌లోనే ఈ అవకాశం వచ్చిందని, ‘విరూపాక్ష’లో మంచి పాత్ర ఇచ్చి ప్రోత్సహించిన దర్శకుడు కార్తీక్‌వర్మ దండు, సుకుమార్, సాయిదుర్గతేజ్లకు కృతజ్ఞతలని రవికృష్ణ చెప్పారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

