నన్ను నేను తిట్టుకున్నాను!
వినోదాత్మకమైన సినిమాలకు కేరాఫ్ కథానాయకుడు ‘అల్లరి’నరేష్. ‘నాంది’చిత్రంతో ఆయన కెరీర్‌ను కొత్తబాట పట్టించాడు. తాజాగా అల్లరి నరేష్ నటించిన ఇంటెన్స్ యాక్షన్ మూవీ ‘ఉగ్రం’. విజయ్ కనకమేడల దర్శకుడు. సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించారు. రేపు చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
వినోదాత్మకమైన సినిమాలకు కేరాఫ్ కథానాయకుడు ‘అల్లరి’నరేష్. ‘నాంది’చిత్రంతో ఆయన కెరీర్‌ను కొత్తబాట పట్టించాడు. తాజాగా అల్లరి నరేష్ నటించిన ఇంటెన్స్ యాక్షన్ మూవీ ‘ఉగ్రం’. విజయ్ కనకమేడల దర్శకుడు. సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించారు. రేపు చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా అల్లరి నరేష్‌తో జరిపిన ఇంటర్వ్యూ ఇది.
కాన్ఫిడెంట్‌గా కనిపిస్తున్నారు?
సినిమా ఇచ్చిన ఎనర్జీ ఇది. ‘ఉగ్రం’పై చాలా నమ్మకంగా వున్నాను. సినిమా విడుదల తరువాత సినిమాలోని ప్రతి అంశం గురించి అందరూ చర్చించుకుంటారు. సాంకేతిక నిపుణులు అంతా ఎంతో కష్టపడి చేసిన సినిమా ఇది. ‘నాంది’ చిత్రం తరువాత అదే కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు పెరిగాయి. ఆ అంచనాలు అందుకోవడం కోసం పదింతలు కసిగా పనిచేశాం.
నాంది, మారేడుమిల్లి ప్రజానీకం, ఉగ్రం ఇలాంటి టైటిల్స్ మీ మీద ఊహించుకోవడం కొంచెం కష్టం కదా?
ఇరవై ఏళ్ళుగా అల్లరి అల్లరిగా వినోదాత్మక సినిమాలు చేయడంతో అలా అనిపిస్తుంది. అయితే అందులో నుంచి బయటికి రావాలి. ఎప్పుడూ అలాంటి సినిమాలే చేస్తుంటే చూసే వారితో పాటు నాకు బోర్ కొడుతుంది. ‘మహర్షి’ చిత్రం నాకు ఓ కొత్త నమ్మకాన్ని ఇచ్చింది. ఆ పాత్రలో ప్రేక్షకులు నన్ను ఆదరించడంతో ధైర్యం వచ్చింది. దీని తర్వాత చేస్తున్న ప్రయాణమే ఇది.
సీరియస్ కథలే చేస్తున్నారు? అదే జోనర్లో కొనసాగాలని అనుకుంటున్నారా?
నాందికి ముందు రచయితలు నన్ను దృష్టిలో పెట్టుకుని ఒక తరహా కథలు రాసేవారు. మహర్షి తరువాత ఇలాంటి సినిమాలు కూడా చేయగలను అని కొత్త కథలు రాయడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఉగ్రం తరువాత మరిన్ని కొత్త కథలు రాస్తారనే నమ్మకం వుంది.
యాక్షన్ పాత్రలు చేయడంసవాల్గా అనిపిస్తుందా?
కామెడీ చేయడం చాలా కష్టం. కామెడీ చేసేవారు ఏదైనా చేయగలుగుతారు. ఈ సినిమా విషయంలో దర్శకుడు నా ప్లస్సుల కంటే మైనస్సులు ముందుగా చెప్పేశాడు. నాకంటే ఎత్తు తక్కువ వున్న వాళ్లతో చేసినప్పుడు నేను ఒంగి మాట్లాడతానని, వరుసగా కామెడీ సినిమాలు చేయడం వలన బాడీ లాంగ్వేజ్ తెలియకుండానే అటు వైపు వెళుతుందని, పాత నరేష్ కనిపిస్తే ఆడియన్స్ డిస్కనెక్ట్ అయిపోతారని, వీటన్నిటిని అధిగింమించాలని ముందే వివరంగా చెప్పాడు. చాలా జాగ్రత్తలు తీసుకుని, కంట్రోల్ చేసి ఉగ్రం చేశాను.
కామెడీ, యాక్షన్ ఇందులో ఏది ఎక్కువ ఎంజాయ్ చేస్తారు?
కామెడీ సరదాగా చేసేయెచ్చు, కానీ ఉగ్రం లాంటి పాత్ర చేస్తున్నప్పుడు మాత్రం అరుపులు, కేకలు వుంటాయి. పైగా దర్శకుడు నరాలు కనిపించాలని చెబుతాడు (నవ్వుతూ). మెంటల్‌గా, ఫిజికల్‌గా బాగా కష్టపడి చేసిన చిత్రం ‘ఉగ్రం’.
స్పూఫ్‌లతో మళ్లీ సినిమా చేసే ఆలోచన వుందా?
లేదండి. ఒకరి అనుకరించడం నటన కాదు. స్పూఫ్‌లు చేసిన రోజుల్లో నన్ను నేను తిట్టుకున్నాను. ఇమిటేట్ చేస్తున్నాను కానీ యాక్ట్ చేయడం లేదనే బాధ వుండేది.
మీ తదుపరి చిత్రాలు?
ఫారియా అబ్దుల్లాతో ఒక సినిమా, సుబ్బు దర్శకత్వంలో సినిమాతో పాటు ‘జెండా’ అనే ఓ కథను తీసుకున్నాను. ఆ సినిమా ఈవీవీ బ్యానర్లో వుంటుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Diwali Celebrations | దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా దీపావళి.. మనకు తెలియని పండుగ విశేషాలివే!
Janhvi Kapoor | కోలీవుడ్‌పై ఫోకస్ పెంచిన బాలీవుడ్ బ్యూటీ.. తమిళ సినిమాలపై ప్రశంసల వర్షం వెనుక అసలు కారణం ఇదేనా?
Bigg Boss 10 | బిగ్ బాస్‌లో ఈ వారం ఎలిమినేషన్ లేదా.. దీపావళి స్పెషల్‌గా నాగార్జున భారీ ట్విస్ట్
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

