Project K | పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) నటిస్తున్న సినిమాల్లో ఒకటి ప్రాజెక్ట్ K (Project k). మహానటి ఫేం నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నాడు. సైన్స్ ఫిక్షన్ జోనర్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. తాజాగా ఈ ప్రతిష్టాత్మక సినిమాలో భాగం కావడం పట్ల మరోసారి తన ఎక్జయిట్‌మెంట్‌ను అందరితో పంచుకున్నాడు బిగ్ బీ (Amitabh Bachchan).
‘ప్రభాస్ లాంటి యాక్టర్‌తో ఒకే ఫ్రేమ్‌లో కనిపించే అవకాశం రావడం గౌరవంగా ఫీలవుతున్నా. అందరికీ ధన్యవాదాలు.. నా గురించి ఆలోచించినందుకు ధన్యవాదాలు నాగి (నాగ్ అశ్విన్)సార్.. ప్రభాస్ నా పట్ల చూపిన వినయం, నాకు ఇచ్చిన గౌరవం మనస్సుకు హత్తుకునేలా భావోద్వేగపూరితంగా ఉన్నాయి. నా ఒక్కడికే కాదు.. ప్రాజెక్ట్ Kలో పాలుపంచుకున్న వారందరికీ.. మీ కృషి కొత్త పుంతలు తొక్కాలని ఆశిస్తూ.. ప్రేమతో ప్రార్థిస్తున్నా..’ అని ట్వీట్ చేశాడు అమితాబ్ బచ్చన్. ఇప్పుడీ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది.
ప్రాజెక్ట్ Kలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే , దిశా పటానీ, ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదల చేసిన దీపికా పదుకొనే లుక్‌తోపాటు ప్రభాస్ హ్యాండ్ లుక్ సినిమా హాలీవుడ్ స్థాయికి ఏ మాత్రం తగ్గకుండా ఉండబోతున్నట్టు చెబుతున్నాయి. మరోవైపు ప్రాజెక్ట్ Kలో కీలకం కాబోయే రైడర్స్ (యూనిఫార్మ్డ్ విలన్ ఆర్మీ) కాస్ట్యూమ్స్ మేకింగ్, అసెంబ్లింగ్ వీడియోను మేకర్స్ విడుదల చేయగా.. నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. ఈ చిత్రాన్ని 2024 జనవరి 12న విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.
ప్రాజెక్ట్ K టీజర్‌ను యూఎస్ఏలో గ్రాండ్‌గా లాంఛ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారని ఇప్పటికే అప్డేట్ వచ్చింది. ప్రభాస్ మరోవైపు ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో నటిస్తున్న సలార్ షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. దీంతోపాటు మారుతి హార్రర్ కామెడీ ప్రాజెక్ట్ కూడా సెట్స్ పై ఉంది.
T 4698 – I am honoured and have had the great privilege of being a part of this great enterprise in Telugu Cinema , ‘Project K’ and to have had the huge honour of being in the same frame of the Idol , Prabhas ..
Thank you all .. and thank you Nagi Sir, for thinking of me ..… https://t.co/7c5vbQ0i5I
— Amitabh Bachchan (@SrBachchan) July 7, 2023
The #ProjectK title and motion poster will be launched in a grand event at USA🇺🇸 in July.#Prabhas pic.twitter.com/KleD9dHgJC
— Manobala Vijayabalan (@ManobalaV) June 22, 2023
రైడర్స్ సిద్దమవుతున్నారిలా..
హాలీవుడ్ రేంజ్లో దీపికాపదుకొనే లుక్..
Here's wishing our @deepikapadukone a very Happy Birthday.#ProjectK #HBDDeepikaPadukone pic.twitter.com/XfCbKapf25
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) January 5, 2023