Taapsee | సెలెబ్రిటీల ప్రైవసీకి ఎప్పుడూ చిక్కే! పబ్లిక్ ఫిగర్ కావడంతో.. వాళ్లు పబ్లిక్‌లోకి రావడానికే జంకే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. తాజాగా బాలీవుడ్ నటి తాప్సీకి ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ఇటీవల ఓ పబ్లిక్ ప్లేస్‌లో తాప్సీ కనిపించింది. తెర మీద అలరించే నటి కండ్లముందు కనిపించేసరికి అక్కడి వారు ఫొటోలు, వీడియోలు తీయడానికి అత్యుత్సాహం ప్రదర్శించారు. ‘వద్దు..’ అని వారిస్తున్నా అభిమానులు వినకపోవడంతో తాప్సీ ఒకింత అసహనం వ్యక్తం చేసింది.
‘నేను నటిని మాత్రమే. పబ్లిక్ ప్రాపర్టీని కాదు. రెండిటికీ చాలా తేడా ఉంది. కెమెరా పట్టుకుని నాపైకి రావడం,ఫిజికల్‌గా హ్యాండిల్ చేయడం చాలా తప్పు. ఎవరైనా నో చెబితే వారి అభిప్రాయానికి గౌరవం ఇవ్వడం నేర్చుకోవాలి. ఇలా అంటున్నానని కొందరు నన్ను తప్పుగా అనుకోవచ్చు. అలాంటప్పుడు ఎందుకు హీరోయిన్గా చేస్తున్నావు అని ప్రశ్నించవచ్చు కూడా. కానీ నటన నాకు నచ్చిన వృత్తి. అందుకే సినిమాలు చేస్తున్నాను’ అని చెప్పుకొచ్చింది తాప్సి.