Prabhas | ప్రభాస్ కారుకుహైదరాబాద్ పోలీసులు జరిమానా విధించారు. నంబర్ ప్లేట్ సరిగ్గా లేకపోవడం, ఎంపీ స్టిక్కర్ ఉండడం, బ్లాక్ ఫిల్మ్ ఉండడంతో ప్రభాస్ కారుకు జరిమానా విధించారు. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36 లో ట్రాఫిక్ పోలీసులు ప్రభాస్ కారును ఆపారు. ఈ కారుకు రూ.1,450 జరిమానా విధించారు. ఆ సమయంలో ప్రభాస్ కారులో లేరు. ఇటీవలే నాగచైతన్య, అల్లుఅర్జున్,ఎన్టీఆర్, మంచుమనోజ్, త్రివిక్రమ్ కార్లకు బ్లాక్ ఫిలిం ఉన్నందును జరిమాన విధించిన విషయం తెలిసిందే.
ఇక సినిమాల విషయానికి వస్తే ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా గడుపుతున్నాడు. ఓ రౌత్ దర్శకత్వంలో ఈయన హీరోగా నటించిన ఆదిపురుష్ షూటింగ్‌ను పూర్తి చేసుకోగా ప్రశాంత్ నీల్ ‘సలార్’, నాగ్ అశ్విన్ ‘ ప్రాజెక్ట్-K’ చిత్రాలు షూటింగ్ దశలో ఉన్నాయి. వీటితో పాటుగా సందీప్ రెడ్డివంగా దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘స్పిరిట్’ ప్రస్తుతం స్క్రిప్ట్ దశలో ఉంది.