Nargis Fakhri | బాలీవుడ్ గ్లామర్ డాల్ నర్గీస్ ఫక్రీ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. బాలీవుడ్లో వైవిధ్యమైన చిత్రాలతో మంచి పేరు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ. ‘రాక్‌స్టార్’ సినిమాతో పరిచయమైన ఈ భామ తొలి సినిమాతోనే స్టార్డమ్ అందుకున్నారు. ఇటీవల ‘హౌస్‌ఫుల్-5’ సినిమాలో నటించి అందరి దృష్టిని ఆకర్షించింది. తెలుగులో పవన్ కల్యాణ్ నటించిన ‘హరి హర వీరమల్లు’ సినిమాలో కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రం ఇటీవల విడుదలై సానుకూల స్పందనను అందుకుంది. మరోవైపు ఇటీవల నర్గీస్ తన డైట్ గురించి చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది.
నేను తొమ్మిది రోజులపాటు కేవలం నీళ్లు తాగే బతుకుతాను. ఇది చాలా కష్టం.9 రోజులు పూర్తయ్యే సరికి ముఖం చాలా వికృతంగా మారడం, కళ్లు, బుగ్గలు లోపలకు వెళ్లిపోయి, దవడ బయటకు వచ్చినట్లు కనిపిస్తుంది. ఫేస్ లో మాత్రం కాస్త గ్లో కనిపిస్తుంటుంది అని చెప్పుకొచ్చింది. తరచూ నీళ్లు తాగుతూ ఉంటాను. విటమిన్స్, మినరల్స్ తదతర మంచి పోషక విలువలు ఉన్న ఆహారాన్ని మాత్రమే తీసుకుంటాను అని నర్గీస్ ఫక్రి పేర్కొంది.ఇక ఇదిలా ఉంటే నర్గీస్ ఫక్రీ ఈ ఏడాది ఫిబ్రవరిలో తన సన్నిహితుడు టోనీ బేగ్‌ని కాలిఫోర్నియాలో నిరాడంబరంగా వివాహం చేసుకుంది.. పెళ్లి తర్వాత ఇద్దరూ కలిసి స్విట్జర్లాండ్ హనీమూన్‌కు వెళ్లారు.
నిత్యం ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా కనిపించే నర్గీస్ తన పెళ్లి విషయాన్ని కాస్త గోప్యంగా ఉంచింది. అయితే తాజాగా ఓ షాకింగ్ విషయం రివీల్ చేసింది. తన 46వ బర్త్ డే సందర్భంగా భర్త పది కోట్ల రూపాయలు విలువ చేసే రోల్స్ రాయిస్ కారుని గిఫ్ట్‌గా ఇచ్చినట్టు వెల్లడించింది. పెళ్లైన తర్వాత మొదటి బర్త్ డే కావడంతో నర్గీస్ ఫక్రీకి ఇంత కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చాడట. ఇక గాగుల్స్ పెట్టుకొని కారు ఎక్కి ఈ అమ్మడు క్యూట్ పోజులు ఇచ్చింది. ఇవి ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఇక నెటిజన్స్.. నర్గీకి బర్త్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.