They Call Him OG | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన బ్లాక్ బస్టర్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఓజీ’ (They Call Him OG). సుజీత్ దర్శకత్వం వహించిన ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామా సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్‌గా నిలవడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద రూ. 300 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కోరుకునే వింటేజ్ యాక్షన్, స్టైలిష్ లుక్స్‌తో పాటు తమన్ సంగీతం, సుజీత్ టేకింగ్ ఈ సినిమాకు హైలైట్‌గా నిలిచాయి. అయితే తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ ‘హంగ్రీ చీతా’ (Hungry Cheetah Video Song) ఫుల్ వీడియో సాంగ్‌ను విడుదల చేశారు. ఈ పాటను మీరు కూడా చూసేయండి.