Pushpa-2 Ott Rights | బన్నీ, సుక్కు కాంబోలో తెరకెక్కిన ‘పుష్ప’ ఎంత పెద్ద సంచలనం సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తొలిరోజు నుంచి బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించింది. ఇక ఎలాంటి అంచనాల్లేకుండా హిందీలో విడుదలై అక్కడ కూడా కలెక్షన్ల సునామీ సృష్టించింది. హిందీ బెల్ట్‌పై వంద కోట్ల బొమ్మతో బన్నీ తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్నాడు. ప్రస్తుతం పుష్ప-2పై టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్ ప్రేక్షకులు కూడా తీవ్ర ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను మార్చిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతుంది. షూటింగ్ దశలో ఉండగానే పుష్ప సీక్వెల్ కోసం పలువురు బడా సంస్థలు కోట్లల్లో ఆఫర్ చేస్తున్నారట. అంతేకాకుండా థియేట్రికల్, నాన్ థియేట్రికల్ హక్కులకు భారీ డిమాండ్ ఏర్పడుతుందట. తాజాగా ఈ సినిమా ఓటీటీ హక్కులకు సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతుంది. కాగా పలు ఓటీటీ సంస్థలు పుష్ప-2 డిజిటల్ హక్కుల కోసం అన్ని భాషలకు కలుపుకుని రూ.200 కోట్ల మేర ఆఫర్ చేసినట్లు తెలుస్తుంది. ఇందులో నిజమెంతుందో గానీ, ఈ నంబర్ మాత్రం పుష్ప రేంజ్ ఏంటో అని స్పష్టం చేస్తుంది.
ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ‘పుష్ప’ చిత్రం రిలీజైన అన్ని భాషల్లోనూ బ్లాక్‌బస్టర్ విజయం సాధించింది. మైత్రీ సంస్థ నిర్మించిన ఈ చిత్రంలో బన్నీకు జోడీగా రష్మిక మందన్నా హీరోయిన్గా నటించింది. మలయాళ స్టార్ హీరో ఫాహద్ ఫాజిల్ ప్రతినాయకుడి పాత్రలో నటించాడు. ఇక ఈ సినిమాలోని డైలాగులు, మేనరిజమ్స్ ,పాటలు ప్రపంచ వ్యాప్తంగా బాగా పాపులర్ అయ్యాయి. సినీ సెలబ్రెటీల నుండి క్రికెటర్స్, రాజకీయ నాయకుల వరకు ప్రతి ఒక్కరు ఈ సినిమా డైలాగ్స్, హూక్ స్టెప్స్‌ను రీల్స్‌గా చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.