అథర్వ, ప్రీతి ముకుందన్, కయాదు లోహర్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘హృదయం మురళి’ చిత్రం ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకురానుంది. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ ద్వారా రిలీజ్ అవుతున్నది. ఆకాష్ భాస్కరన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఫహాద్ ఫాజిల్ కీలక పాత్రను పోషించారు. ఈ సందర్భంగా మంగళవారం ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు.
ఈ సినిమా ఎన్నో జ్ఞాపకాలను గుర్తుచేస్తుందని, ప్రతి ఒక్కరి మనసుకు దగ్గరైన కథ ఇదని, తమన్ అద్భుతమైన సంగీతాన్ని అందించడంతో పాటు ఓ కీలకమైన పాత్రలో కూడా నటించారని హీరో అథర్వ తెలిపారు. హృదయానికి హత్తుకునే ప్రేమకథ ఇదని ప్రీతి ముకుందన్ చెప్పింది. గతంలో ‘హృదయం’ ఎంత బ్లాక్‌బస్టర్ హిట్ అయిందో, అదే తరహాలో ఈ సినిమా కూడా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉందని మైత్రి శశి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.