హృతిక్ శౌర్య, వరలక్ష్మీ శరత్‌కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘అశ్వద్ధామ’. చంద్రశేఖర్ ఆజాద్ దర్శకత్వం వహిస్తున్నారు. ఫ్లిక్నైనా ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తున్నది. హీరో హృతిక్ శౌర్య పుట్టిన రోజు సందర్భంగా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘గ్రామీణ నేపథ్యంలో సాగే లవ్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రమిది. కమర్షియల్ అంశాలతో ఆకట్టుకుంటుంది.
వరలక్ష్మీ శరత్‌కుమార్ పాత్ర ప్రత్యేకంగా నిలుస్తుంది. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తయ్యాయి’ అని చిత్రబృందం పేర్కొంది. చిత్రం శ్రీను, టెంపర్ వంశీ, మానిక్ రెడ్డి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: శ్యామ్ కె నాయుడు, సంగీతం: ప్రజ్వల్ కుమార్, కథ, మాటలు, దర్శకత్వం: చంద్రశేఖర్ ఆజాద్ పాటిబండ్ల.