బాలీవుడ్ అగ్ర హీరో హృతిక్ రోషన్ పెళ్లి వార్తలు ముంబయి సినీ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారాయి. భార్య సుసానేఖాన్తో విడాకుల అనంతరం హృతిక్ రోషన్ మ్యూజీషియన్ సబాఆజాద్తో ప్రేమాయణం సాగిస్తున్నారు. ఇటీవల సబా ఆజాద్‌కు తన ఇంటికి ఆహ్వానించిన హృతిక్ రోషన్ ఆమెతో ప్రత్యేకంగా సంగీత కచేరి ఏర్పాటు చేశాడని తెలిసింది. ‘సబా ఆజాద్, హృతిక్ మధ్య అనుబంధం మరింత బలపడింది. ఈ ఏడాది వారు పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారు. హృతిక్ కుటుంబ సభ్యులు ఇప్పటికే తమ అంగీకారం తెలిపారు’ అని హృతిక్ సన్నిహితులు అంటున్నారు. ప్రస్తుతం విక్రమ్‌వేదా, ఫైటర్ చిత్రాల్లో నటిస్తున్నారు హృతిక్‌రోషన్.