తమిళంలో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ‘విక్రమ్ వేద’ చిత్రం హిందీలో హృతిక్ రోషన్, సైఫ్అలీఖాన్ ప్రధాన పాత్రల్లో రీమేక్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో ఈ అగ్ర హీరోలిద్దరూ నాయక, ప్రతినాయక పాత్రల్ని పోషిస్తున్నారు. తమిళ మాతృకకు దర్శకత్వం వహించిన పుష్కర్ గాయత్రి హిందీ వెర్షన్ నిర్దేశక బాధ్యతల్ని తీసుకున్నారు. ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకురానుంది. తాజాగా సినిమా రిలీజ్‌కు సంబంధించిన ఓ విషయం హాట్‌టాపిక్‌గా మారింది.
ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా దాదాపు వంద దేశాల్లో విడుదల చేయబోతున్నారు. బాలీవుడ్లో ఇదొక అరుదైన ఫీట్ అని అంటున్నారు. ఉత్తర అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ పాటు దాదాపు 20 యూరప్ దేశాల్లో ఈ సినిమా రిలీజ్ కానుంది. హిందీ సినిమాలకు అంతగా మార్కెట్ లేని జపాన్, రష్యా దేశాల్లో ఈ సినిమా విడుదల కాబోతుండటం విశేషంగా చెబుతున్నారు. ఆఫ్రికాలోని దాదాపు 30 దేశాల్లో కూడా ఈ సినిమా విడుదలకానుంది.