బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ (Hrithik Roshan), నటి సబా ఆజాద్ ( Saba Azad)తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న సంగతి తెలిసిందే. హృతిక్ రోషన్-సబా ఆజాద్ కలిసి కెమెరా కంటపడుతూ..టాక్ ఆఫ్ దిటౌన్గా నిలుస్తున్నారు. ఈ ఇద్దరు ప్రేమలో ఉన్నారంటూ కొంతకాలంగా వార్తలు బీటౌన్‌లో షికారు చేస్తున్నాయి. ఇటీవలే హృతిక్ రోషన్ ఫ్యామిలీతో కలిసి లంఛ్ చేసింది సబా ఆజాద్. కుటుంబ సభ్యులు అందరితో సరదా సమయాన్ని ఎంజాయ్ చేసింది.
ఈ ఫొటోలు కూడా ఇప్పటికే నెట్టింట్లో హల్ చల్ చేయడంతో హృతిక్-సబా (Hrithik-Saba Azad) రిలేషన్షిప్ పై వస్తున్న వార్తలకు మరింత బలం చేకూరినట్లైంది. ఇక ఈ ఇద్దరూ త్వరలోనే పెళ్లి పీటలెక్కడం ఖాయమనే వార్త బీటౌన్ లోహాట్ టాపిక్‌గా మారింది. ఇటీవలే బాలీవుడ్ నటుడు ఫర్హాన్ తన ప్రియురాలు శిబానీ దండేకర్‌ను రెండో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ వేడుకకు హృతిక్ కూడా హాజరై..ఫర్హాన్‌తో కలిసి డ్యాన్స్ చేసి స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాడు. హృతిక్ కూడా రెండో పెళ్లి చేసుకునేందుకు రెడీగా ఉన్నాడని బాలీవుడ్ మీడియా ఓ కథనంలో రాసుకొచ్చింది.
హృతిక్ రోషన్ 2000వ సంవత్సరంలో బాలీవుడ్ నటి సుసానేఖాన్‌ను పెళ్లి చేసుకోగా..వీరికి ఇద్దరు కుమారులు. 2014లో హృతిక్-సుసానే ఖాన్ వైవాహకి బంధానికి స్వస్తి పలికారు. మరి హృతిక్ రోషన్ ఈ వార్తలపై ఇప్పటివరకు స్పందించలేదు. ఇద్దరిలో ఎవరైనా ఈ విషయంపై
ఏమైనా ఇస్తారో చూడాలి.