హృతిక్‌రోషన్, ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘వార్-2’ ఆగస్ట్ 14న ప్రేక్షకుల ముందుకురాబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే విడుదలైన టీజర్ అంచనాల్ని రెట్టింపు చేసింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ ‘రా’ గూఢచారి పాత్రలో కనిపించనున్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమా ప్రమోషన్స్ విషయంలో నిర్మాణ సంస్థ యష్‌రాజ్ ఫిల్మ్స్ కొత్త వ్యూహంతో ముందుకురానుంది.
ప్రచార కార్యక్రమాల్లో ఇద్దరు హీరోలు కలిసి పాల్గొనబోరని చెబుతున్నారు. ఇద్దరు విడివిడిగా ఈవెంట్స్‌కు హాజరవుతారట. ఈ పాన్ ఇండియా చిత్రానికి ఇద్దరు సూపర్‌స్టార్స్ ప్రధానాకర్షణగా నిలిచారని, వారిద్దరిని తెరపై చూస్తేనే ప్రేక్షకులకు థ్రిల్ ఉంటుందనే ఉద్దేశ్యంతో యష్‌రాజ్ ఫిల్మ్స్ ఈ కొత్త ప్రచార వ్యూహాన్ని అమలు చేయబోతున్నదని తెలిసింది. తొలిభాగం ‘వార్’ విషయంలో కూడా ఇదే స్ట్రాటజీని ఫాలో అయ్యారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఎన్టీఆర్-హృతిక్‌రోషన్ ప్రత్యర్థుల పాత్రల్లో కనిపించనున్నారు.