Hritik Roshan | ఫస్ట్ సినిమాకే రూ.700 కోట్ల బడ్జెట్.. మెగాఫోన్ పడుతున్న హృతిక్ రోషన్
Hritik Roshan | బాలీవుడ్ స్టార్ నటుడు హృతిక్ రోషన్ మెగాఫోన్ పడుతున్నాడు. ఈ విషయాన్ని అతడి తండ్రి రాకేష్ రోషన్ ఎక్స్ వేదికగా పంచుకున్నాడు. హృతిక్ రోషన్ హీరోగా నటించిన సూపర్ హీరో చిత్రం క్రిష్ ఎంత పెద్ద హిట్టయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
Hritik Roshan | బాలీవుడ్ స్టార్ నటుడు హృతిక్ రోషన్ మెగాఫోన్ పడుతున్నాడు. ఈ విషయాన్ని అతడి తండ్రి రాకేష్ రోషన్ ఎక్స్ వేదికగా పంచుకున్నాడు. హృతిక్ రోషన్ హీరోగా నటించిన సూపర్ హీరో చిత్రం క్రిష్ ఎంత పెద్ద హిట్టయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అప్పటివరకు హాలీవుడ్ సూపర్ హీరోలు మాత్రమే తెలిసిన ప్రేక్షకులకు ఇండియన్ సూపర్ హీరోగా హృతిక్ రోషన్ అలరించాడు. కోయి మిల్ గయా, క్రిష్, క్రిష్ 3 సినిమాలు రాగా బ్లాక్ బస్టర్ అందుకున్నాయి. ఇప్పుడు ఇదే ఫ్రాంచైజీ నుంచి క్రిష్ 4 రాబోతుంది. మొదటి మూడు పార్టులకు హృతిక్ రోషన్ తండ్రి రాకేష్ రోషన్ దర్శకత్వం వహించగా.. తాజాగా వచ్చే క్రిష్ 4తో హృతిక్ మెగాఫోన్ పట్టబోతున్నాడు. ఈ విషయాన్ని తెలుపుతూ.. హృతిక్ తండ్రి రాకేష్ రోషన్ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టాడు.
దుగ్గూ (హృతిక్ రోషన్) 25 సంవత్సరాల క్రితం నిన్ను నటుడిగా పరిచయం చేశాను. ఇప్పుడు 25 ఏళ్ల తర్వాత ఆదిత్య చోప్రా నేను కలిసి దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నాం. దర్శకుడిగా నీ ప్రయాణంలో నువ్వు అనేక విజయాలు సాధించాలని ఆశిస్తున్నాను. మా ప్రతిష్టాత్మక చిత్రం ‘క్రిష్ 4’కి నీవు దర్శకత్వం వహిస్తుండటం సంతోషంగా ఉందంటూ రాకేష్ రోషన్ రాసుకోచ్చాడు. ఈ విషయం తెలిసిన బాలీవుడ్ ప్రముఖులు హృతిక్‌కి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మరోవైపు ఈ ప్రాజెక్ట్ రూ.700 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్నట్లు సమాచారం.
Duggu 25yrs back I launched you as an actor, and today again after 25 yrs you are being launched as a director by two filmmakers Adi Chopra & myself to take forward our most ambitious film #Krrish4.
Wish you all the success in this new avatar with good wishes and blessings! ♥️ pic.twitter.com/QkRsg8mThU
— Rakesh Roshan (@RakeshRoshan_N) March 28, 2025
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
Ranabaali | విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. ‘రణబాలి’ డబ్బింగ్ వెర్షన్స్ విడుదల వాయిదా!
Riyadh airport | రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడిని తీవ్రంగా ఖండించిన భారత్..!
Suchitra Flyover | సుచిత్ర ఫ్లైఓవర్ పనులు వెంటనే ప్రారంభించాలి.. ఫ్లైఓవర్‌కు పిండ ప్రదానం.. వీడియో
Newzealand | భారత్‌తో వందేళ్ల క్రీడానుబంధం.. వన్డే సిరీస్ కోసం ప్రత్యేక జెర్సీ విడుదల..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

