‘గేమ్‌ఛేంజర్’లో ‘జరగండి జరగండి జరగండీ..’ పాట ఎంత హిట్ అయ్యిందో తెలిసిందే. ఈ పాటకు ప్రభుదేవా నృత్యరీతుల్ని సమకూర్చారు. ఈ ఒక్కపాటకు ఆయన రెమ్యునరేషన్ ఎంత తీసుకున్నారో తెలుసా?! ఒక్క పైసా కూడా తీసుకోలేదట. ఈ విషయాన్ని స్వయంగా దర్శకుడు శంకర్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ప్రభుదేవా.. చిరంజీవి వీరాభిమాని. మెగాస్టార్ నటించిన ఎన్నో పాటలకు ఆయన కొరియోగ్రఫీ అందించారు. దర్శకుడిగా కూడా పనిచేశారు. ఆ ప్రేమతోనే ‘గేమ్‌ఛేంజర్’లోని పాటకు నృత్యరీతుల్ని సమకూర్చారట. మరో విషయం ఏంటంటే.. ప్రభుదేవాను ‘ప్రేమికుడు’ సినిమాతో హీరోని చేసింది శంకర్. అది కూడా ఓ కారణం కావొచ్చు.