Mammootty Name History | మలయాళ సినిమా పరిశ్రమలో మెగాస్టార్గా వెలుగొందుతున్న నటుడు మమ్ముట్టి అసలు పేరు మహమ్మద్ కుట్టీ అన్న విషయం తెలిసిందే. అయితే మహమ్మద్ కుట్టీ అనే పేరు మమ్ముట్టిగా ఎలా మారింది? ఆ పేరు వెనుక ఉన్న కథ ఏంటి? అనే విషయాన్ని తాజాగా వెల్లడించారు మమ్ముట్టి. అంతేగాకుండా తనకు ఆ పేరు పెట్టిన చిన్ననాటి స్నేహితుడిని కూడా ఆయన అభిమానులకు పరిచయం చేశారు. కేరళలో జరిగిన ఒక కార్యక్రమంలో కాలేజీ రోజుల్లో జరిగిన సరదా సన్నివేశాన్ని పంచుకున్నారు.
నేను కాలేజీలో చదువుకునేటప్పుడు, అందరితో నా పేరు ఒమర్ షరీఫ్ (ప్రముఖ నటుడు) అని చెప్పేవాడిని. నా అసలు పేరు మహమ్మద్ కుట్టీ అని కాలేజీలో ఎవరికీ తెలియదు. అయితే ఒకరోజు నేను నా ఐడీ కార్డు మర్చిపోయాను. దాంతో నా అసలు పేరు అందరికీ తెలిసిపోయింది. నా స్నేహితుల్లో ఒకరు… ‘నీ పేరు షరీఫ్ కాదు మమ్ముట్టి’ అని అన్నారు. ఐడీ కార్డులో మహమ్మద్ కుట్టీ అని ఉన్నపటికీ అతను పొరపాటున ‘మమ్ముట్టి’ అని చదివాడు. అయితే పోరపాటుగా చదివిన ఆ పేరు తర్వాత నిజమైన పేరుగా మారిపోయిందని మమ్ముట్టి చెప్పుకోచ్చాడు. ఈ సందర్భంగా తన పేరు మార్పుకు కారణమైన ఆ కాలేజీ స్నేహితుడి పేరు శశిధరన్ అని వెల్లడించి, ఆయన్ని ప్రేక్షకులకు పరిచయం చేశారు. కాలేజీలో జరిగిన ఒక సరదా సంఘటన వల్ల తాను మెగాస్టార్ మమ్ముట్టిగా మారానని ఆయన నవ్వుతూ చెప్పడం అభిమానులను ఆకట్టుకుంది.
Mammukka talking about his college days and introducing the friend who gave him the iconic name — #Mammootty
Such a wholesome moment ❤️
pic.twitter.com/aNLVoOqt9o— ALIM SHAN (@AlimShan_) November 27, 2025