Bigg Boss: బరువు తగ్గేందుకు శాయశక్తులా కృషి చేస్తున్న హౌజ్‌మేట్స్

మంగళవారం బిగ్ బాస్ ఇంటి సభ్యులకు కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ ఇవ్వగా,ఇందులో ఇంటి సభ్యులని రెండు జంటలుగా విడిపోవాలని సూచించారు. దీంతో జశ్వంత్-కాజల్, సిరి-షణ్ముఖ్, లోబో- నటరాజ్ మాస్టర్, రామ్-హమిదా, యానీ-శ్వేత, ప్రియా- ప్రియాంక, రవి-విశ్వ, సన్నీ-మానస్ విడిపోయారు. కెప్టెన్సీ పోటీ దారుల కోసం గెలవాలంటే తగ్గాల్సిందే అనే టాస్క్ ఇవ్వగా, ఏ జంట అయితే అధిక బరువు తగ్గుతారో వారే కెప్టెన్సీ కంటెండర్‌గా నిలుస్తారు అని బిగ్ బాస్ తెలిపారు.
అందరు టాస్క్ కోసం సిద్ధమవుతూ బరువు తగ్గేందుకు చాలా కృషి చేశాయి. గెలవాలంటే తగ్గాల్సిందే టాస్క్‌లో భాగంగా తొలి చాలెంజ్‌గా ‘పట్టుకోండి చూద్దాం’అనే గేమ్ పెట్టాడు బిగ్‌బాస్. దీంట్లో భాగంగా.. పవర్ రూమ్ యాక్సెస్ పొందిన జంట..తమతో పోటీకి దిగబోయే జంటను ఎంచుకునే అవకాశం ఉటుంది. ఇందులో నటరాజ్ మాస్టర్-లోబో జంట పవర్ రూమ్ యాక్సెస్ పొంది శ్రీరామ్-హమిదాలను తమ పోటీదారులుగా ఎంచుకున్నారు. ఈ గేమ్‌లో శ్రీరామ్-హమిదా జంట విజయ సాధించింది.
అనంతరం రవి.. ప్రియతో పాత గొడవ గురించి డిస్కషన్ చేయగా, వదిలేయ్ అని చెప్పింది ప్రియ. నటరాజ్ మాస్టర్ చిత్ర విచిత్రంగా ప్రవర్తించాడు.. తనలో తాను మాట్లాడుకుంటూ.. పెద్ద పెద్దగా నవ్వుకుంటూ.. మంచి బలం ఉన్న ఫిజికల్ టాస్క్ పెడితే నా వేట ఏంటో చూపిస్తా అని తనలో తాను మాట్లాడుకుంటూ పిచ్చి పిచ్చిగా ప్రవర్తించాడు. అతని ప్రవర్తన చూసి అందరు నవ్వేశారు.ఇక లోబో ఆకలికి ఆగలేక.. ప్రిజ్డ్లో పెట్టిన ఫుడ్‌ని సీక్రెట్‌గా లాగించేయడంతో హౌస్ కెప్టెన్ జెస్సీకి శిక్ష వేశాడు బిగ్ బాస్. జెస్సీతో పాటు ఆయనతో జత కట్టిన కాజల్‌పై అనర్హత వేటు వేశారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

