Housefull 5 Trailer | బాలీవుడ్లో నవ్వుల జాతర సృష్టించిన ‘హౌస్‌ఫుల్’ ఫ్రాంచైజీ నుంచి తాజాగా మరో చిత్రం వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ ఫ్రాంచైజీ నుంచి నాలుగు చిత్రాలు రాగా.. తాజాగా 5వ చిత్రం ప్రస్తుతం థియేటర్లో సందడి చేస్తుంది.
అక్షయ్ కుమార్, అభిషేక్ బచ్చన్, రితేష్ దేశ్‌ముఖ్ ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా.. తరుణ్ మన్సుఖానీ దర్శకత్వం వహించాడు. నడియాడ్వాలా గ్రాండ్సన్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై సాజిద్ నడియాడ్వాలా ఈ సినిమాను నిర్మించాడు. ఈ చిత్రం జూన్ 06న ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. అయితే ఈ సినిమాపై ప్రేక్షకుల ఎలా రియాక్ట్ అవుతున్నారో తెలుసుకుందాం అనుకున్నాడు నటుడు అక్షయ్ కుమార్. ఇందులో భాగంగా.. ఒక థియేటర్ దగ్గరికి మాస్క్‌తో వెళ్లిన అక్షయ్ కుమార్ అక్కడ సినిమా చూసిన తర్వాత థియేటర్ బయటకి వచ్చిన ప్రేక్షకులను రివ్యూ అడిగాడు. కొందరూ ఈ సినిమా బాగుందని చెప్పగా.. మరికొందరూ ఈ మూవీ యావరేజ్ అంటూ రివ్యూ ఇచ్చారు. అయితే దీనికి సంబంధించిన వీడియోను అక్షయ్ తాజాగా ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నాడు.