Akshay Kumar | హిందీ నటుడు అక్షయ్ కుమార్ తన కెరీర్లో ఎన్ని తోపు సినిమాలు చేసినా.. హౌజ్‌ఫుల్ సిరీస్ మాత్రం ఎప్పుడు ప్రత్యేకమే. దాదాపు పుష్కర కాలం ముందు స్టార్ట్ అయిన ఈ సిరీస్‌లో ఇప్పటివరకు నాలుగు భాగాలొచ్చాయి. నాలుగు ఒకదానికి మించి మరొకటి బంపర్ హిట్లయ్యాయి. అంతేకాకుండా అక్షయ్ కుమార్ గ్రాఫ్ పడిపోతున్న ప్రతీసారి ఈ సినిమాలే లేపాయి. ఇక ఈ సిరీస్ నిర్మాత నదియావాల పాలిట కామధేనువుల కాసలు వర్షం కురిపించింది. హౌజ్‌ఫుల్ సిరీస్‌లోని నాలుగు భాగాలు కలిపి దాదాపు వెయ్యి కోట్ల వరకు కలెక్షన్లు రాబట్టాయంటే ఈ సిరీస్‌కున్న క్రేజ్ ఏంటో ప్రత్యేకించి చెప్పనసవరం లేదు.
కాగా తాజాగా ఈ సిరీస్‌లోని ఐదో పార్టును మేకర్స్ ప్రకటించారు. దోస్తానా, డ్రైవ్ వంటి బ్లాక్‌బస్టర్ సినిమాల దర్శకుడు తరుణ్ మన్సుఖాని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా పూర్తయిపోయింది. రేపో మాపో సెట్స్ మీదకు కూడా వెళ్లనుంది. రితేష్ దేశ్‌ముఖ్ మరో ప్రధాన హీరోగా నటిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది దీపావళి సందర్భంగా రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ లెక్కన చూసుకుంటే వీలైనంత తర్వగానే షూటింగ్ స్టార్ట్ చేసి బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్‌ను జరుపనున్నారు. ఈ సారి మరింత గ్రాండియర్‌గా నదియావాలా ఈ సినిమాను ప్లాన్ చేశాడట.
అక్షయ్ కుమార్ కూడా ఈ మధ్య బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపులతో డీలా పడిపోయాడు. రెండేళ్ల కిందట వచ్చిన సూర్యవంశీ తర్వాత ఇప్పటివరకు అక్షయ్ కుమార్‌కు హిట్టే లేదు. రెండు, మూడు కాదు ఏకంగా అరడజను సినిమాలు బకెట్ తన్నేశాయి. ప్రస్తుతం ఆయన ఆశలన్నీ రెండు నెలలో విడుదల కాబోతున్న ఓ మై గాడ్ సినిమా పైనే. అమిత్ రాయ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా అగస్టు 11న విడుదల కాబోతుంది. ఇప్పటివరకు రిలీజైన టీజర్, గ్లింప్స్ గట్రా సినిమాపై మంచి హైప్‌నే తెచ్చిపెట్టాయి. చూడాలి ఆ ఏడాదైనా అక్షయ్ బౌన్స్ బ్యాక్ అవుతాడో లేదో.
Get ready for FIVE times the madness! 💥
Bringing to y’all #SajidNadiadwala’s #Housefull5
Directed by @TarunmansukhaniSee you in cinemas on Diwali 2024! @Riteishd @NGEMovies @WardaNadiadwala pic.twitter.com/CbzMy0PxOO
— Akshay Kumar (@akshaykumar) June 30, 2023