Hostel days Trailer | కరోనా పుణ్యమా అని ఓటీటీలకు ఎక్కడలేని ఆదరణ పెరిగింది. ఒకప్పుడు థియేటర్ల నుంచి వెళ్లిపోయిన సినిమా టీవీల్లో చూడాలంటే కనీసం మూడు నుంచి నాలుగు నెలలైనా పట్టేది. కానీ ఓటీటీలు వచ్చాక వారం, రెండు వారాల్లోనే అరచేతిలోకి వచ్చేస్తున్నాయి. ప్రేక్షకులు కూడా ఓటీటీలకు బాగా అలవాటు పడిపోయారు. ప్రతీ వారం కొత్త సినిమా ఏది రిలీజవుతుందా అని తెగ వెతికేస్తున్నారు. ముఖ్యంగా ఓటీటీల్లో ఈ మధ్య వెబ్ సిరీస్‌ల ట్రెండ్ ఎక్కువైపోయింది. కంటెంట్ కాస్త ఎంటర్టైన్ చేసే విధంగా ఉంటే ఐదారు గంటలైనా అలవోకగా చూసేస్తున్నారు. గతకొన్ని రోజుల నుంచి తెలుగులోనూ వెబ్ సిరీస్‌లకు మంచి డిమాండ్ ఏర్పడుతుంది.
ఈ క్రమంలో తాజాగా కాలేజీ లైఫ్ మీద హాస్టల్ డేస్ అనే వెబ్ సిరీస్ రూపొందింది. తాజాగా ఈ వెబ్ సిరీస్‌కు సంబంధించిన ట్రైలర్ రిలీజైంది. ఇంజనీరింగ్ కాలేజీ లైఫ్‌లను ఎంటర్టైనింగ్గా చూపించబోతున్నట్లు ట్రైలర్‌తో స్పష్టం అయింది. కాలేజీ ఫ్రెండ్షిప్, లవ్, సరదాగా చేసే పనులు, హాస్టల్లో కష్టాలు, స్టడీస్, సీనియర్ అండ్ జూనియర్ మధ్య జరిగే ఇన్సిడెంట్స్ ఇలా ఇంజనీరింగ్ ఫేజ్ మొత్తాన్ని చూపించబోతున్నట్లు ట్రైలర్‌తో తెలుస్తుంది. ఇప్పటికే ఇంజనీరింగ్ పైన ఎన్నో సినిమాలు వచ్చినా.. మళ్లీ అదే కాన్సెప్ట్‌తో కొత్తగా సినిమాగానీ, వెబ్ సిరీస్గాని వస్తుందంటే ఇట్టే కనెక్ట్ అయిపోతుంటాం.
ఆదిత్య మండల దర్శకత్వం వహించిన ఈ సిరీస్ ఐదు ఎపిసోడ్లుగా తెరకెక్కింది. దరహాస్ మాటూరు, అక్షయ్ లగుసాని, మౌళి తనూజ్, అనన్య ఆకుల, ఐశ్వర్య హొలకాల్ మరియు జయేత్రి మకన ఈ సిరీస్‌లో ప్రధాన పాత్రలు చేశారు. ఇక జూన్ 13 నుంచి ఈ వెబ్ సిరీస్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.
engineering hostels are a biosphere within themselves 🏫🤪 #HostelDaysOnPrime, July 13
trailer out now! @Darahasmaturu @Aklagusani #Mouli @anannyaa7akulaa #AishwaryaHollakal @jaiyetrimakana @ArunabhKumar @koshyvijay @uncle_sherry @adityamandala #AkshayPoolla pic.twitter.com/jDtXJzmxFb— prime video IN (@PrimeVideoIN) July 7, 2023