Rachel Movie | హనీరోజ్.. ఈ ఏడాది సంక్రాంతి నుంచి ఈ పేరు టాలీవుడ్లో మార్మోగిపోతుంది. పదిహేనేళ్ల కిందటే ఆలయం అనే తెలుగు సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది ఈ మలయాళ బ్యూటీ. ఆ తర్వాత వరుణ్ సందేష్‌తో కలిసి ఈ వర్షం సాక్షిగా సినిమా చేసింది. అ రెండు అల్ట్రా డిజాస్టర్లు కావడంతో తెలుగులో ఈమెకు పెద్దగా అవకాశాలు రాలేవు. అయితే ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన వీరసింహా రెడ్డి సినిమా మాత్రం ఈమెకు మంచి బ్రేక్ ఇచ్చింది. నిజానికి ఆన్ స్క్రీన్‌లో కంటే ఆఫ్ స్క్రీన్లోనే హనీకి విపరీతమైన పాపులారిటీ వచ్చింది. ముఖ్యంగా యూత్‌లో ఈమె క్రేజ్ మాములుగా లేదు. ఏదైనా షాపింగ్ మాల్ ఓపెనింగ్‌కు హనీరోజ్ వస్తుందంటే చాలు యూత్ తండోపతండాలుగా వస్తున్నారు.
ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ మలయాళ రాచెల్ అనే పాన్ ఇండియా సినిమా చేస్తుంది. తాజాగా ఈ సినిమా నుంచి హనీ రోజ్ ఫస్ట్‌లుక్ పోస్టర్ రిలీజైంది. కత్తి పట్టుకుని మాంసం కొడుతున్నట్లున్న పోస్టర్ తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తుంది. చుట్టు దున్నపోతుల తలకాయలతో, మాంసపు ముక్కలతో హనీరోజ్ బీఫ్ మాంసం కొడుతున్నట్లు తెలుస్తుంది. వీరసింహా రెడ్డిలో గ్లామర్‌ను ఒలకబోసిన హనీరోజ్.. రాచెల్ కోసం సీరియస్ క్యారెక్టర్ చేస్తుంది. ఆనందిని బాల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను బదుశా ఎన్ఎమ్, షినోయ్ మాథ్యూ, అబ్రిడ్ షైన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రాహుల్ మనప్పట్టు కథనందించాడు.