న్యూఢిల్లీ: హాలీవుడ్ హీరో వాల్ కిల్మర్(Val Kilmer) మృతిచెందారు. అతని వయసు 65 ఏళ్లు. అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో ఏప్రిల్ ఒకటో తేదీన కిల్మర్ తుది శ్వాస విడిచారు. 1995లో రిలీజైన బ్యాట్మన్ ఫరెవర్ చిత్రంలో అతను బ్రూస్ వెయిన్ పాత్రను పోషించాడు. న్యూమోనియాతో బాధపడుతూ అతను ప్రాణాలు విడిచినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. చాన్నాళ్ల నుంచి కిల్మర్ గొంతు క్యాన్సర్‌కు చికిత్స తీసుకుంటున్నాడు.
టాస్ సీక్రెట్(1984), రియల్ జీనియస్(1985) చిత్రాల్లో కామిడీ పాత్రలను పోషించారు. 1986లో రిలీజైన టాప్ గన్‌లో టామ్ క్రూయిజ్‌తో కలిసి నటించాడు. ఫాంటసీ చిత్రం విల్లో(1998) కూడా నటించాడు. ఓలివర్ స్టోన్ డైరెక్షన్లో వచ్చిన ద డోర్స్(1991) చిత్రంలో జిమ్ మారిసన్ పాత్రను పోషించాడు. టోంబ్‌స్టోన్(1993), ట్రూ రొమాన్స్(1993), హీట్(1995), ద గోస్ట్ అండ్ ద డార్క్నెస్(1996) చిత్రాల్లోనూ కిల్మర్ నటించాడు.
1980, 90 దశకాల్లో తన నటనతో కిల్మర్ అందర్నీ ఆకట్టుకున్నాడు. అయితే ఇటీవల రిలీజైన టాప్ మావరిక్ చిత్రంలోనూ కొన్ని సీన్లలో అతను కనిపించాడు. 2022లో టాప్ గన్ మావరిక్ ఫిల్మ్ రిలీజైంది. అయితే క్యాన్సర్ వల్ల అతను ఎక్కువగా మాట్లాడలేకపోయాడు.
లాస్ ఏంజిల్స్‌లో కిల్మర్ జన్మించాడు. చాట్స్వర్త్లో అతని బాల్యం గడిచింది. హాలీవుడ్ ప్రొఫెషనల్ స్కూల్, జులియార్డ్ స్కూల్‌కు హాజరయ్యాడు. ద ప్రిన్స్ ఆఫ్ ఈజిప్ట్ లాంటి యానిమేషన్ చిత్రాలకు అతను వాయిస్ ఓవర్ ఇచ్చాడు. ఎట్ ఫస్ట్ సైట్, రెడ్ ప్లానెట్, పొలాక్, ద సాల్టాన్ సీ, వండర్ల్యాండ్, ద మిస్సింగ్ లాంటి చిత్రాల్లోనూ నటించాడు. కిస్ కిస్ బ్యాంగ్ బ్యాంగ్ చిత్రంలో రాబర్ట్ డౌనీ జూనియర్, డెంజిల్ వాషింగ్టన్‌తో డీజావూ చిత్రంలో నటించాడు.
1996లో భార్య వాలేకు విడాకులు ఇచ్చాడు. అతనికి కూతురు మెర్సిడీస్, కుమారుడు జాక్ ఉన్నారు.