Allu Arjun 22 Project | పుష్ప 2 ది రూల్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత అల్లు అర్జున్ ఎలాంటి సినిమా చేస్తున్నాడా అని ఎదురుచూస్తున్న అభిమానులకు బన్నీ సూపర్ అప్డేట్ను ప్రకటించిన విషయం తెలిసిందే.
తమిళ దర్శకుడు అట్లీతో తన నెక్స్ట్ ప్రాజెక్ట్ చేస్తున్నాడు అల్లు అర్జున్. ఈ సినిమాకు సన్ పిక్చర్స్ అధినేత కళానిధి మారన్ నిర్మిస్తుండగా.. అల్లు అర్జున్ 22వ సినిమాగా ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఈ మూవీ షూటింగ్ దాదాపు అమెరికాలో జరుపుకోబోతుంది. ఈ సందర్భంగా ఇప్పటికే అల్లు అర్జున్‌తో పాటు దర్శకుడు అట్లీ చిత్రయూనిట్ మొత్తం అమెరికాకు చేరుకుంది. ఈ సినిమాలో దీపికా పదుకొనే కథానాయికగా నటిస్తుండగా.. విలన్ రోల్‌కి సంబంధించి ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సినిమాలో హాలీవుడ్ స్టార్ నటుడు విల్ స్మిత్‌ను విలన్‌గా తీసుకుబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే అల్లు అర్జున్ సినిమా పాన్ ఇండియా నుంచి ఇంటర్నేషనల్ వరకు వెళుతుంది. కాగా ఈ విషయంపై చిత్రబృందం నుంచి ప్రకటన రావాల్సి ఉంది. ఈ చిత్రంలో అల్లు అర్జున్ మూడు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారని సమాచారం.