తెలుగు సినీరంగంలోకి హెచ్ఎన్ క్యూబ్ పేరుతో నూతన సంస్థ చిత్ర నిర్మాణరంగంలోకి అడుగుపెట్టింది. ఈ బ్యానర్లో రామ్నందా దర్శకనిర్మాతగా వరుసగా ఐదు చిత్రాలను రూపొందిస్తున్నారు. గురువారం ఈ సంస్థ లోగో, మోషన్ పోస్టర్‌ను వ్యాపారవేత్త మహేష్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దర్శకనిర్మాత రామ్నందా మాట్లాడుతూ ‘నేను రియల్ ఎస్టేట్ రంగం నుంచి సినిమాల్లోకి వచ్చాను. క్రియేటివ్ ఫీల్డ్ అంటే చాలా ఇష్టం. ప్రస్తుతం మా సంస్థలో ప్రేమలు-పెళ్లిళ్లు, మనసు, ఎల్ఎస్ఎల్ఎమ్, గతి, రామున్ని నేనే-రావణున్ని నేనే చిత్రాలు తెరకెక్కబోతున్నాయి. అన్ని సినిమాలకు సంబంధించిన స్క్రిప్ట్‌లు సిద్ధంగా ఉన్నాయి. ప్రేమలు-పెళ్లిళ్లు చిత్రాన్ని తొలుత సెట్స్‌మీదకు తీసుకొస్తాం. ప్రేక్షకులు మెచ్చే మంచి కంటెంట్‌తో సినిమాలు తీయాలన్నది నా లక్ష్యం’ అన్నారు.