Nani | వరుస విజయాలతో దూసుకుపోతున్న నాని కథానాయకుడిగా రూపొందుతున్న చిత్రం ‘HIT : The 3rd Case’. ఇది నాని నటిస్తున్న 32వ సినిమా కావడం విశేషం. డాక్టర్ శైలేష్ కొలను దర్శకుడు. ప్రశాంతి తిపిర్నేని నిర్మిస్తున్నారు. ఇందులో హిట్ ఆఫీసర్ అర్జున్ సర్కార్‌గా ఫెరోషియస్ కేరక్టర్లో నాని కనిపించనున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ శుక్రవారం నుంచి హైదరాబాద్‌లో మొదలైంది. తొలిరోజే నాని షూటింగ్లో జాయిన్ అయ్యారు. ఈ షెడ్యూల్లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తామని, వచ్చే ఏడాది మే 1న వేసవిలో విడుదల చేస్తామని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: సాను జాన్ వర్గీస్, సంగీతం: మిక్కీ జె.మేయర్, నిర్మాణం: వాల్‌పోస్టర్ సినిమా, యునానిమస్ ప్రొడక్షన్స్.